/rtv/media/media_files/2025/02/24/w9u8dwhgAZ5tMDTG9rxF.jpg)
Vallabhaneni Vamshi SIT
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. ఆయనపై నమోదైన కేసుల విచారణకు సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ కు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వం వహించనున్నారు. సభ్యులుగా ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, తూర్పుగోదావరి ఎస్పీ నరసింహ కిషోర్ వ్యవహరించనున్నారు. వంశీపై అక్రమ మైనింగ్, భూ కబ్జాలు, ఆర్థిక నేరాలు, ఎక్స్ టార్షన్ తదితర అభియోగాల కింద కేసులు నమోదయ్యాయి. వంశీ అక్రమ మైనింగ్ సహా వివిధ నేరాల ద్వారా ప్రభుత్వానికి రూ.195 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు సిట్ ఏర్పాటుకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టీడీపీ ఆఫీసులో పని చేసే కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసిన కేసులో వంశీ ఇప్పటికే అరెస్టు అయిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: YCP Kethireddy: సింహాలతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సెల్ఫీ.. ఫొటోలు వైరల్!
మూడు రోజుల కస్డడీకి వంశీ..
ఇదిలా ఉంటే.. వల్లభనేని వంశీకి విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్ట్ ఈ రోజు షాక్ ఇచ్చింది. ఆయనను 3 రోజుల కస్టడీకిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించాలంటూ ఆదేశించింది. విజయవాడ లిమిట్స్ లోనే కస్టడీలోకి తీసుకొని విచారించారంటూ ఆదేశాల్లో పేర్కొంది. న్యాయవాది సమక్షంలోనే విచారించాలంటూ స్పష్టం చేసింది. తాను వెన్నుపూస నొప్పి కారణంగా ఇబ్బంది పెడుతున్నానంటూ వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు స్పందించింది. బెడ్ అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: పులివెందుల ప్రజలకు జగన్ గుడ్ న్యూస్.. ఎల్లుండే ప్రారంభోత్సవం!
2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గన్నవరం ఎమ్మెల్యేగా విజయం సాధించిన వంశీ.. అనంతరం వైసీపీలో చేరారు. అయితే.. అప్పటి నుంచి టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబంపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అనేక సార్లు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. వంశీ అక్రమాలను రెడ్ బుక్ లో ఎంటర్ చేశామని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయని టీడీపీ నేతలు అనేక సార్లు ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా వంశీ అరెస్ట్ జరిగిందన్న చర్చ సాగుతోంది.