మోదీ సర్కార్ కు జగన్ ప్రశంసలు.. సంచలన ట్వీట్!

నేటి నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ కొత్త స్లాబుల అంశంపై ఏపీ మాజీ సీఎం జగన్ స్పందించారు. GST పునర్నిర్మాణం అనేది ఒక సరళమైన, నిష్పాక్షికమైన పన్ను వ్యవస్థ దిశగా ఒక విప్లవాత్మకమైన అడుగు అని కొనియాడారు.

New Update
jagan modi

నేటి నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ కొత్త స్లాబుల అంశంపై ఏపీ మాజీ సీఎం జగన్ స్పందించారు. GST పునర్నిర్మాణం అనేది ఒక సరళమైన, నిష్పాక్షికమైన పన్ను వ్యవస్థ దిశగా ఒక విప్లవాత్మకమైన అడుగు అని కొనియాడారు. ప్రతీ పౌరుడికి వస్తువులు, సేవలను మరింత సరళంగా అందుబాటులోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నమని అభినందించారు. ఈ ప్రక్రియ ప్రయోజనాలు చివరి వినియోగదారులకు చేరతాయని ఆశిస్తున్నానన్నారు. అక్కడక్కడా కొన్ని లోపాలు, కొన్ని ఫిర్యాదులు ఉండొచ్చు కానీ ఇది ఆర్థిక వ్యవస్థకు కావాల్సిన బూస్టప్ అందిస్తుందని ఆకాంక్షించారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మోదీ సర్కార్ ను ప్రశంసిస్తూ జగన్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు వైసీపీ మద్దతు ఇచ్చింది. ఆ అభ్యర్థికి ఓటు వేసింది. తాజాగా ఇప్పుడు జీఎస్టీ స్లాబుల మార్పుపై సైతం జగన్ ప్రశంసలు కురిపించడం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపై ఎన్డీఏ నేతలు ఎలా స్పందిస్తారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. 

Advertisment
తాజా కథనాలు