AP Crime:  ఏపీలో దారుణం.. ఏకంగా సీఐ తల్లిని కిడ్నాప్ చేసి..

ఏపీలో సీఐ తల్లి కిడ్నాప్‌ కథ విషాదాంతమైంది. ధర్మవరం వన్‌టౌన్‌ సీఐ నాగేంద్రప్రసాద్‌ తల్లి స్వర్ణ కుమారి (62)  గత నెల 29వ తేదీన కిడ్నాప్‌నకు గురైంది. తాజాగా ఆమె మృతదేహం బయటపడింది.

murder

Murder

New Update

AP News: ఏపీలో సీఐ తల్లి కిడ్నాప్‌ కథ విషాదాంతమైంది. ధర్మవరం వన్‌టౌన్‌ సీఐ నాగేంద్రప్రసాద్‌ తల్లి స్వర్ణ కుమారి (62)  గత నెల 29వ తేదీన కిడ్నాప్‌నకు గురైంది. తాజాగా ఆమె మృతదేహం బయటపడింది. ఎదురింట్లో ఉన్న వెంకటేష్‌ అనేవ్యక్తి కిడ్నాప్‌ చేసి హత్య చేసి మృతదేహాన్ని పాతిపెట్టినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. స్థానిక సమాచారం ప్రకారం..  మదనపల్లె శివారులోని వైఎస్‌ జగన్‌ కాలనీలో ధర్మవరం వన్‌టౌన్‌ సీఐ నాగేంద్రప్రసాద్‌ తల్లి స్వర్ణకుమారి ఒంటరిగా ఉంటోంది. గత నెల 29న ఎందురింట్లో ఉంటున్న వెంకటేష్‌తో ఉదయం 10 గంటలకు పుంగనూరులో ఉన్న స్వామి దగ్గర మంత్రించుకోవడానికి వెళ్లింది. స్వర్ణకుమారి వద్ద భారీగా డబ్బులు తీసుకున్న వెంకటేష్‌ ఆమెను కిడ్నాప్‌ చేసి హత్య చేశారు. మృతదేహాన్ని మదనపల్లె టూ టౌన్‌ పరిధిలో పాతిపెట్టాడు. ఆ సమయంలో స్వర్ణకుమారి స్నేహితురాలు ఫోన్‌ చేయగా కాల్‌ ఫార్వర్డ్‌ అనే వాయిస్‌ వచ్చింది. 

తల్లి ఆచూకీ ఎక్కడ దొరక్కపోవడంతో..

స్వర్ణకుమారి ఆ రోజు సాయంత్రం ఇంటికి రాకపోవటంతో ఏదైనా దూరంలో ఉన్న గుడికి వెళ్లి ఉండోంచని అందరు అనుకున్నారు. కానీ అక్టోబర్‌ 1వ తేదీన పింఛన్‌ తీసుకునేందుకు రాకపోవడంతో సీఐ నాగేంద్ర ప్రసాద్‌కు స్థానికులు ఈ విషయాన్ని తెలిపారు. రంగలోకి దిగిన సీఐ తల్లి ఆచూకీ కోసం మదనపల్లెలో చుట్టపక్కల విచారించాడు. తల్లి ఆచూకీ ఎక్కడ దొరక్కపోవడంతో మదనపల్లె టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసి పోలీసులు నిందితుడు వెంకటేష్‌ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. స్వర్ణకుమారి దగ్గర వెంకటేష్‌ భారీగా నగదు అప్పుగా  తీసుకున్నాడని.. ఆ విషయంలో ఇద్దరికి గొడవ అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ  క్రమంలోనే వెంకటేష్‌ హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.  సీఐ తల్లి కిడ్నాప్‌, హత్య నేపథ్యంలో ఏపీలో ఈ అరాచకం ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పోలీసు కుటుంబాలకే రక్షణ లేకపోతే.. సామాన్యుల పరిస్థితి ఏంటని తీవ్రంగా మండిపడుతున్నారు.

ఇది కూడా చదవండి: కాశ్మీర్‌లో కాంగ్రెస్ విజయం.. ఏపీలో హస్తం నేతల సంబరాలు!

#ap-crime
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe