BREAKING: పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం

AP: సనాతన ధర్మంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు త్వరలోనే జనసేనలో కొత్త వింగ్ ఏర్పాటు చేస్తానని ప్రకటన చేశారు. ఆ వింగ్‌కు నారసింహ వారాహి బ్రిగేడ్‌గా పేరు పెడుతున్నట్లు చెప్పారు.

New Update
Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు షాక్‌.. వారాహి యాత్రను అడ్డుకున్న పోలీసులు

Pawan Kalyan: సనాతన ధర్మంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు త్వరలోనే జనసేనలో కొత్త వింగ్ ఏర్పాటు చేస్తానని ప్రకటన చేశారు. ఆ వింగ్‌కు నారసింహ వారాహి బ్రిగేడ్‌గా పేరు పెడుతున్నట్లు చెప్పారు. సనాతన ధర్మాన్ని విమర్శిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అన్ని మతాలను గౌరవిస్తా, నా విశ్వాసాలపై నిలబడతా అని పవన్‌ కళ్యాణ్ అన్నారు.

ఇది కూడా చదవండి: జగన్ సంచలనం.. బీజేపీకి వ్యతిరేకంగా పోరు బాట!

ధర్మ పరిరక్షణ కోసం.. 

ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటించారు పవన్ కళ్యాణ్. జగన్నాథపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ‘దీపం-2’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సనాతన ధర్మాన్ని కాపాడేందుకు జనసేన కృషి చేస్తోందని అన్నారు. ‘నారసింహ వారాహి బ్రిగేడ్’ వింగ్‌ను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, కానీ తన విశ్వాసాలపై నిలబడతానని చెప్పారు. సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు, సనాతన ధర్మాన్ని అగౌరవపరిచేవారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పార్టీలో ‘నారసింహ వారాహి బ్రిగేడ్’ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటన చేశారు.

ఇది కూడా చదవండి: అలిగిన టీడీపీ ఎంపీ.. మంత్రులు ఆపిన ఆగలేదు!

కఠిన చర్యలు...

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్టు పవన్ చెప్పారు. దీపం-2 పథకంలో భాగంగా ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను అందిస్తామని అన్నారు. ప్రతి ఏడాది 1,08,39,286 మంది ఈ పథకం కింద లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. ఇందుకోసం ఏడాదికి రూ. 2,684 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. మహిళలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పవన్ హె చ్చరించారు.

ఇది కూడా చదవండి:  జమ్మూ కశ్మీర్‌లో మరో పేలుడు.. 12 మందికి తీవ్ర గాయాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు