ఏపీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ రోజు పిఠాపురంలో పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. తాను 15 ఏళ్లు పొత్తులో ఉండాలనుకున్నానన్నారు. కానీ అధికారులు సహకరించట్లేదన్నారు. అధికారులు సహకరిస్తేనే ఇది సాధ్యమవుతుందన్నారు. అధికారులకు హనీమూన్ పీరియడ్ అయిపోయిందన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో నాటకాలు వేస్తే తొక్కినారతీస్తానన్నారు. క్రిమినల్స్‌కు కులం ఉండదని స్పష్టం చేశారు. తనకు కష్టాలు తెలుసు కాబట్టే తగ్గి మాట్లాడుతానన్నారు. లా అండ్ విషయంలో నాటకాలు వేస్తే తొక్కినారతీస్తానన్నారు. ఇది కూడా చదవండి: TTD: వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటి..అసలు తొక్కిసలాట ఎందుకు జరిగింది! తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పాలి -పవన్ కళ్యాణ్ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు,EO శ్యామల రావు, AEO వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు భక్తులకు క్షమాపణ చెప్పాలి సారీ చెప్పడానికి నామోషీ ఎందుకు..ఇలాంటి వారికి కాకపోతే ఇంకెవరికి చెప్తాం #HashtagU pic.twitter.com/LHDNH6IyfJ — Hashtag U (@HashtaguIn) January 10, 2025 టీటీడీ చైర్మన్, ఈవో క్షమాపణ చెప్పాల్సిందే.. తిరుపతి ఘటనపై సైతం మరోసారి పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాట ఘటనపై తాను క్షమాపణ చెప్పానన్నారు. క్షమాపణ చెప్పేందుకు అధికారులకు ఎందుకు నామోషీ అని ఫైర్ అయ్యారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలా రావు, అడిషనల్ ఈవో వెంకయ్యచౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు కూడా క్షమాపణ చెప్పాలన్నారు. తొక్కిసలాట ఘటనపై అందరూ క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. అధికారులు తప్పు చేయడంతో.. ప్రజలు సంబరాలు కూడా చేసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: CM Chandrababu: ఇలా ఎవడైనా చేస్తాడా?: అధికారులపై చంద్రబాబు ఫుల్ సీరియస్! పిఠాపురంలో మినీ గోకులాలు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు•రైతు శ్రీ యాతం నాగేశ్వరరావుకి గోవులు అందజేత•రాష్ట్రవ్యాప్తంగా 12,500 గోకులాలకు లాంఛనంగా ప్రారంభోత్సవం•మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ నిధులతో అతి తక్కువ సమయంలో గోకులాల నిర్మాణం pic.twitter.com/u9srOfOG1G — Collector Kakinada (@CollectorKakin1) January 10, 2025 ఈ సారి పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుందామని భావించానన్నారు. కానీ తిరుపతి ఘటనతో తగ్గి చేసుకుంటున్నట్లు చెప్పారు. పిఠాపురం నియోజకవర్గం కుమారపురంలో మినీ గోపులాన్ని ఈ రోజు పవన్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన 12,500 మినీ గోకులం షెడ్లను సైతం పవన్ ప్రారంభించారు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అమూల్ ను తీసుకువచ్చి ప్రభుత్వ డెయిరీలను చంపేసిందని ఆరోపించారు. అమ్మాయిలను వేధించడం మగతనం కాదన్నారు. అలాంటి పిచ్చ పిచ్చ వేశాలు వేస్తే తాట తీస్తామన్నారు. అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేస్తే తొక్కి నార తీస్తాం- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ @PawanKalyan @JanaSenaParty #PawannKalyan #pawankalyanspeech#pawankalyanmasswarning pic.twitter.com/FvwHp21MoK — The Politician (@ThePolitician__) January 10, 2025