YCP: జగన్ చాప్టర్ క్లోజ్.. బీజేపీతో బిగ్ స్కెచ్ వేసిన చంద్రబాబు!

ఢిల్లీలో వైసీపీ అడ్రస్ గల్లంతు అయ్యేలా కనిపిస్తోంది. వైసీపీని నామరుపాల్లేకుండా చేసేందుకు బీజేపీతో చంద్రబాబు బిగ్ పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. 11మంది రాజ్య సభ సభ్యులకు ప్రస్తుతం 7గురు మిగిలుండగా మిగతావారు కూడా రాజీనామా చేయనున్నట్లు సమాచారం. 

New Update
JAGAN-CHANDRABABU-jpg

YS Jagan, AP CM Chandrababu

YCP: ఢిల్లీలో వైసీపీ అడ్రస్ గల్లంతు అయ్యేలా కనిపిస్తోంది. వైసీపీ అడ్రస్ లేకుండా చేసేందుకు NDA కూటమి పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఏపీలో అమిత్ షా పర్యటన తర్వాత పరిణామాలు ఊహించని రీతిలో మారుతుండగా లోక్‌సభ, రాజ్యసభలో వైసీపీకి ప్రాతినిథ్యం లేకుండా చేయడమే టార్గెట్ గా బీజేపీ పావులు కదుపుతోంది. ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి రాజ్యసభలో 11 మంది సభ్యులుండగా వైసీపీకి ప్రస్తుతం 8 మంది సభ్యులున్నారు. ఇటీవల బీద, మోపిదేవి, ఆర్.కృష్ణయ్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం విజయసాయిరెడ్డి రాజీనామాతో  వైసీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్యం 7కి పడిపోయింది. 

ఎంపీలంతా త్వరలోనే రాజీనామా..

ప్రస్తుతం రాజ్యసభలో అయోధ్య రామిరెడ్డి, గొల్లబాబురావు, పిల్లి సుభాష్, మేడా రఘునాథ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పరిమళ్ నత్వాని లోక్‌సభలో అవినాష్ రెడ్డి, గురుమూర్తి, తనుజరాణి, మిథున్ రెడ్డిలున్నారు. అయితే వైసీపీ ఎంపీలంతా త్వరలోనే పదవికి రాజీనామా చేసే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పూర్తిగా రాజకీయాలకు దూరంగా లేదా ఇతర పార్టీల్లో చేరే అవకాలున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం పార్లమెంట్‌లో వైసీపీకి నలుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. 

ఇది కూడా చదవండి: Brezil Strome: సూపర్ సెల్ తుఫాన్‌తో బ్రెజిల్‌ అతలాకుతలం.. వీడియో వైరల్!

విజయసాయి రెడ్డి రాజీనామాతో వైసీపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని తెలిపారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరనని ఆయన స్పష్టం చేశారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వై యస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ కు, ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మకు సదా కృతజ్ఞుడినన్నారు.

ఇది కూడా చదవండి: TG News: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఇప్పట్లో లేనట్లే!

Advertisment
తాజా కథనాలు