/rtv/media/media_files/2025/11/19/fotojet-2025-11-19t085354494-2025-11-19-08-54-14.jpg)
top leader Dev Ji encounter ?
BIG BREAKING: ఆంధప్రదేశ్ లోని ఏజెన్సీ అడవుల్లో బుధవారం మరో ఎన్‌కౌంటర్ ఘటన చోటు చేసుకుంది. పోలీసులకు, నక్సలైట్లకు జరిగిన ఎదురుకాల్పుల తాజా ఉదంతంలో ఏడుగురు నక్సలైట్లు మృతి చెందారు. ఎన్‌కౌంటర్ ఘటనను ఏపీ అదనపు డీజీపీ మహేష్ చంద్ర లడ్హా ధ్రువీకరించారు. ఎన్‌కౌంటర్ ఎక్కడ జరిగిందనే అంశంపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది. ఘటన సమాచారం సేకరిస్తున్నామని, మరికాసేపట్లో వివరాలు వెల్లడిస్తామని మహేష్ చంద్ర లడ్హా పేర్కొన్నారు.
అల్లూరి జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో ఈ రోజు ఉదయం ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు తెలుస్తుండగా వారిలో మావోయిస్టు అగ్రనేత, పార్టీ ప్రధానకార్యదర్శి దేవ్‌జీ అలీయాస్ తిప్పరి తిరుపతి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆయనతో పాటు ఆజాద్ వంటి అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Follow Us