/rtv/media/media_files/2025/08/14/ys-jagan-vs-chandrababu-2025-08-14-11-40-53.jpg)
అసెంబ్లీ ఎన్నికలను తలపించిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాల్లో టీడీపీ సత్తా చాటింది. జగన్ సొంత నియోజకవర్గంలో రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు 6 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే.. జగన్ కంచుకోటపై కన్నేసిన టీడీపీ ఈసారి ఎలాగైనా ఇక్కడ విజయం సాధించాలన్న లక్ష్యంతో తొలి నుంచి పక్కా ప్లాన్ తో ముందుకెళ్లింది. పులివెందులలో టీడీపీ గెలుపుకు దోహదం చేసిన 5 ప్రధాన కారణాలు ఇలా ఉన్నాయి.
- పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డిని బరిలోకి దించింది. దీంతో ఎన్నికల హీట్ అమాతం పెంచేసింది. వార్ వన్ సైడ్ అన్న చర్చకు తెరలేపింది. గతంలో చివరి నిమిషంలో అభ్యర్థులు విత్ డ్రా చేసుకున్న అనుభవాలతో ఈ సారి అలా జరగదన్న బలమైన సంకేతాలు ప్రజల్లోకి పంపించింది.
- జగన్ అంటేనే ఒంటికాలిపై లేచే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.. విరుచుకుపడే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిని ప్రచారంలోకి దించారు చంద్రబాబు. దీంతో వైసీపీ ఓటమికి ఈ లీడర్లు కసితో పని చేశారు.
- క్షేత్ర స్థాయిలో బీటెక్ రవి చక్రం తిప్పారు. వీరితో పాటు ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సవిత, మంత్రి కొలుసు పార్థసారథి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, బైరెడ్డి శబరి తదితరులు క్షేత్ర స్థాయిలో ప్రచారాన్ని పరుగులు పెట్టించారు.
పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది..
— Telugu Desam Party (@JaiTDP) August 14, 2025
హామీ ఇచ్చిన ప్రకారం, నీరు అందించి, అన్ని నియోజకవర్గాలు లాగే, అభివృద్ధి ఫలాలను పులివెందుల ప్రజలకు, కూటమి ప్రభుత్వం అందిస్తుంది.#FreedomAfter30Years#IdhiManchiPrabhutvam#pulivendula#AndhraPradeshpic.twitter.com/MXhwOvMvYX - పులివెందులలో గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తామంటూ నేతలంతా ఏకతాటిపైకి వచ్చి ప్రచారం చేశారు. పూర్తి సమన్వయంతో పని చేశారు. ప్రతీ గ్రామంలో వైసీపీ ముఖ్య నేతలు టీడీపీలోకి చేరేలా వ్యూహాలు రచించారు.
- ప్రచారానికి వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయిలో సమస్యలు గుర్తించి పరిష్కారానికి హామీలు ఇచ్చారు. దాదాపు ప్రతీ ఇంటిని ముఖ్య నేతలు చుట్టేశారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.