/rtv/media/media_files/2025/07/11/ycp-leader-murder-2025-07-11-17-51-09.jpg)
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో దారుణం చోటు చేసుకుంది. కొయిరాలమెట్ట దగ్గర వైసీపీ నేత సత్తారు గోపి దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు కత్తులతో వేటాడి దారుణంగా చంపారు. గోపి హత్యతో ఫరీదుపేటలో హైటెన్షన్ నెలకొంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులు మోహరించారు. పట్టపగలు నడి రోడ్డుపై హత్య జరగడంతో ప్రజలు భయ భ్రాంతులకు గురయ్యారు. టీడీపీ నేతలే ఈ హత్య చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ మహేశ్వరరెడ్డి సందర్శించారు. నిందితులను త్వరలోనే పట్టుకుని.. వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.