/rtv/media/media_files/2025/08/12/pulivendula-by-election-1-2025-08-12-19-11-55.jpg)
హోరాహోరీగా సాగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొద్ది సేపటి క్రితం ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు పులివెందులలో 74.57 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఒంటిమిట్టలో 70 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో జరుగుతున్న ఈ ఎన్నికను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికార టీడీపీ సైతం జగన్ కంచుకోటలో పాగా వేయాలన్న లక్ష్యంతో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డిని బరిలోకి దించింది. టీడీపీ తరఫున బీటెక్ రవి, మాధవి రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తదితరులు ప్రచారం నిర్వహించారు.
గెలుపు మాదే: టీడీపీ
వైసీపీ తరఫున ఎంపీ అవినాష్ రెడ్డి ప్రచారం చేశారు. అయితే.. పోలింగ్ సరళిని బట్టి చూస్తే గెలుపు తమదేనని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో వై నాట్ కుప్పం అంటూ.. కామెంట్లు చేసిన వైసీపీకి ఈ ఎన్నికతో గట్టి కౌంటర్ ఇచ్చామంటున్నారు. వై నాట్ పులివెందుల అంటూ ప్రకటనలు చేస్తున్నారు.
వైసీపీ పాలనలో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవు. ఎప్పుడూ బెదిరించి ఏకగ్రీవాలే. ఈ రోజు కూటమి ప్రజా పాలనలో, పులివెందుల, ఒంటిమిట్టలో 11 నామినేషన్లు వచ్చాయి. 30 ఏళ్ళ తరువాత ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.#FreedomAfter30Years#AndhraPradeshpic.twitter.com/oR9ArC4FpM
— Telugu Desam Party (@JaiTDP) August 12, 2025
నెక్స్ట్ పులివెందులలో ఎగిరేది టీడీపీ జెండానే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నెక్ట్స్ జగన్ ను ఓడించడమే తమ లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు. వార్ వన్ సైడ్ కాలేదని.. తాము గట్టి పోటీ ఇచ్చామని వైసీపీ చెబుతోంది. అయితే.. ఈ ఉప ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 14న నిర్వహించనున్నారు.
పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు..
సున్నితమైన ప్రాంతం కావడంతో షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి పోలీసులు ఇక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టారు. భారీగా బలగాలను మోహరించారు. డీఐజీ కోయ ప్రవీణ్ అక్కడే ఉంటూ ఎప్పటికప్పుడూ పరిస్థితులను సమీక్షిస్తూ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ప్రచారంతో పాటు నేడు పోలింగ్ సందర్భంగా సైతం అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మొత్తంగా చూస్తే పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎల్లుండి జరిగే పోలింగ్ పై అధికారులు ఫోకస్ పెట్టారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.