వైసీపీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు సీటు నుంచి పోటీ చేయడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎస్వీ మోహన్ రెడ్డి పోటీ పడ్డారు. దీంతో వీరిద్దరికి షాక్ ఇస్తూ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ ను బరిలోకి దించారు జగన్.ఇది కూడా చదవండి: VIRAL PHOTOS: మన్మోహన్ తో వైఎస్, చంద్రబాబు, KCRతో పాటు తెలుగు ముఖ్య నేతలు క్లీన్ ఇమేజ్ ఉండడం, ముస్లిం ఓటర్లు అధికంగా ఉండడంతో ఆయన అభ్యర్థిత్వం కలిసి వస్తుందని జగన్ భావించారు. కానీ ఇంతియాజ్ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఈ రోజు ఆయన పార్టీకి రాజీనామాను ప్రకటించారు. దీంతో వైసీపీ కర్నూలు సిటీ నియోజకవర్గ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇది కూడా చదవండి: తెలంగాణకు మన్మోహన్ చేసింది మరువలేం. పార్లమెంట్ బిల్లు టైంలో.. వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటన2024 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కర్నూలు నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఇంతియాజ్ pic.twitter.com/dFNi9Rgfui — RTV (@RTVnewsnetwork) December 27, 2024 పార్టీ బలోపేతంపై జగన్ ఫోకస్.. ఇదిలా ఉంటే పార్టీని బలోపేతం చేయడంపై జగన్ ఫోకస్ పెట్టారు. ఈ రోజు కరెంట్ బిల్లుల పెంపుపై ఆయన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. పలు జిల్లాల్లో ఈ కార్యక్రమం విజయవంతం అయ్యింది. మరోవైపు జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు. ప్రజాదర్భార్ నిర్వహించిన ప్రజలు, నాయకులతో సమావేశం అవుతున్నారు. పార్టీకి కంచుకోటగా చెప్పుకునే రాయలసీమలో పార్టీని బలోపేతం చేయడానికి జగన్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.