/rtv/media/media_files/2025/09/04/ap-govt-2025-09-04-16-41-57.jpg)
సర్పంచులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంతకాలంగా నిలిచిపోయిన 15వ ఆర్థిక సంఘం నిధులను వాడుకునేందుకు పంచాయతీరాజ్ శాఖ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల గ్రామాల్లో నిలిచిపోయిన పనులు మళ్లీ పరుగులు పెట్టనున్నాయి. ఈ ఏడాది జనవరి 5వ తేదీన పంచాయతీల్లో చేసిన తీర్మానాల ప్రకారమే ఈ నిధులను ఖర్చు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇప్పటికే గ్రామాల్లో పనులు పూర్తి చేసి, వాటి వివరాలను మెజర్మెంట్ బుక్స్ లో నమోదు చేసిన వారికి వెంటనే బిల్లులు చెల్లించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పెండింగ్లో ఉన్న పాత బిల్లుల చెల్లింపు ప్రక్రియ వేగవంతం కానుంది. దీనివల్ల కాంట్రాక్టర్లకు, సర్పంచులకు పెద్ద ఊరట లభించినట్లయింది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, డ్రైనేజీ పనులు, ఇతర అత్యవసర అభివృద్ధి పనుల కోసం ఈ నిధులు ఎంతో కీలకం.
సర్పంచులు అప్పులు చేసి
ప్రభుత్వం తీసుకున్న ఈ లేటెస్ట్ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పంచాయతీల్లో అభివృద్ధి పనులు మళ్లీ ఊపందుకోనున్నాయి. చాలా గ్రామాల్లో సర్పంచులు అప్పులు చేసి మరీ పనులు పూర్తి చేశారు. ఇప్పుడు ఈ నిధుల విడుదలతో, ఎవరైతే పనులు పూర్తి చేసి బిల్లుల కోసం వేచి చూస్తున్నారో, వారికి ప్రాధాన్యత క్రమంలో డబ్బులు అందుతాయి. దీనివల్ల పంచాయతీలపై ఉన్న ఆర్థిక భారం తగ్గుతుంది.
Follow Us