అమరావతిలో జరిగిన డ్రోన్ షో అందరిని ఆకట్టుకుంది. రెండు రోజుల పాటు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సదస్సులో మొత్తం తొమ్మిది ప్యానల్ డిస్కషన్స్, 50 స్టాళ్లలో డ్రోనతో ప్రదర్శనలు, అలాగే రాష్ట్ర ముసాయిదా డ్రోన్ పాలసీ పత్రం ఆవిష్కరణ లాంటి తదితర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఈ డ్రోన్ షో ఐదు ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. దీనికి సంబంధించిన ధ్రువపత్రాలను గిన్నిస్ బుక్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకి అందించారు.
ఇది కూడా చూడండి: Big Breaking: ఏపీలో టీడీపీ నేత దారుణ హత్య
కాంతులతో అమరావతి..
కృష్ణా నది తీరంలో ఈ డ్రోన్ షో కాంతులతో కలకలలాడింది. సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ స్థాయి డ్రోన్ సమ్మిట్‌లో భాగంగా మంగళగిరిలో సీకే కన్వెన్షన్‌లో దీన్ని ప్రారంభించారు. ఈ డ్రోన్ సమ్మిట్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.
ఇది కూడా చూడండి: Dana Cyclone: దూసుకొస్తున్న దానా..బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం!
ఆకాశంలో వివిధ రూపాల్లో వస్తున్న డ్రోన్‌ల విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విమానం ఎగరడం, జాతీయ పతాకం రెపరెపలాడటం, బుద్ధుడు ధ్యానం చేయడం, భూమి తిరగడం లాంటి వాటిని డ్రోన్ల ద్వారా నిర్వాహకులు అద్భుతంగా ప్రదర్శించారు. డ్రోన్ల ప్రదర్శనకు ముందు సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. ఆ తర్వాత సీఎం చంద్రబాబు ఈ డ్రోన్ సమ్మిట్‌లో మాట్లాడారు.
ఇది కూడా చూడండి:ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు.. కొనసాగుతోన్న వాయుగుండం
అమరావతిలో జరుగుతున్న డ్రోన్ సమ్మిట్.. ఒక గేమ్ ఛేంజర్ అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. 1995లో కొత్తగా వస్తున్న ఐటీని స్వీకరించామని.. దాని ఫలితమే ఈరోజు ఐటీ రంగంలో తెలుగువాళ్లు ముందున్నారని అభిప్రాయపడ్డారు. భారతీయులు ఐటీ, ఫార్మా, బయో టెక్నాలజీ రంగాల్లో దూసుకుపోతున్నారు. కొత్తగా వచ్చే సాంకేతికతను అందిపుచ్చుకొని.. అవకాశాలను సృష్టించికోవడంలో ఏపీ ప్రభుత్వం ముందుంటుందన్నారు.
ఇది కూడా చూడండి: Telangana: రాష్ట్రవ్యాప్తంగా 162 మంది ఏఈవోల సస్పెన్షన్!