Karnataka Liquor: కదిరిలో కర్ణాటక మద్యం కలకలం... భారీగా పట్టుకున్న పోలీసులు
శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న మద్యం బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. 92 కర్ణాటక మద్యం బాక్సులు పట్టుకున్నట్లు మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీలత వెల్లడించారు.