YCP: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో అధికార పార్టీ వైసీపీ నేతలు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైదాపురంలో డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఉన్న “స్వస్తిక్ వెహికల్ వాటర్ సర్వీస్ సెంటర్”ను ఆదివారం అర్ధరాత్రి కూల్చి వేశారని వాటర్ సర్వీస్ సెంటర్ యజమాని కాంతు వాపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..కదిరిలో రెచ్చిపోయిన అధికార పార్టీ నాయకులు.!
కదిరిలో "స్వస్తిక్ వెహికల్ వాటర్ సర్వీస్ సెంటర్" ను అధికార పార్టీ నేతలు ధ్వంసం చేశారని ఆరోపిస్తున్నారు ఆ యాజమాని. దాదాపు 30 లక్షల విలువచేసే మిషనరీ పాడైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అండదండలతోనే వైసీపీ నేతలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

Translate this News: