AP News: చిన్నారి లక్షిత కిడ్నాప్ కథ సుఖాంతం...పోలీసుల అదుపులో కిడ్నాపర్
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాత్రి కిడ్నాప్‌నకు గురైన చిన్నారి లక్షిత కథ సుఖాంతమైంది. ఎస్పీ మాధవరెడ్డి సమక్షంలో చిన్నారిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాత్రి కిడ్నాప్‌నకు గురైన చిన్నారి లక్షిత కథ సుఖాంతమైంది. ఎస్పీ మాధవరెడ్డి సమక్షంలో చిన్నారిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.
అనంతపురం కలెక్టరేట్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో కంట్రోల్ తప్పి వేగంగా దూసుకెళ్ళింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.
రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని రైతాంగ సమస్యలను నిస్మరించిన సీఎం జగన్మోహన్రెడ్డి చంద్రబాబు నాయుడుని ఏమీ చేయలేరని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి డి.జగదీష్ విమర్శించారు.
కదిరిలోని 35 వార్డు కుమ్మరివాళ్ళపల్లిలో టీడీపీ ఇన్చార్జి కందికుంట ప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన నాయకులతో కలిసి బాబు గ్యారెంటీ భవిష్యత్‌కు గ్యారంటీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు పలు ఆరోపణలు చేశారు.
అనంతపురంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో యువతిని పిలిపించుకుని.. అఘాయిత్యానికి పాల్పడ్డాడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కృష్ణారెడ్డి. ఆపై వీడియోలు, ఫోటోలు తీసి తన స్నేహితుడికి పంపగా.. అతనూ బ్లాక్ మెయిల్ చేసి యువతిపై అత్యాచారం చేశాడు.
ఇంట్లో వారు ఎలాగైన పెళ్లి చేస్తారనే భయంతో నాకు ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తున్నారని సూసైడ్ నోటు రాసి అపార్ట్ మెంట్ లోని ఏడవ అంతస్తు పై నుంచి దూకి గౌరీ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది
అనంతపురం జిల్లాలోని హెచ్ఎల్సీ ఆయకట్టు రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. ప్రస్తుతం కర్ణాటక ఎగువ ప్రాంతంలో వర్షాలు పడక తుంగభద్రలో వాటర్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. అందుకుగాను ముందుగానే ఆయకట్టు రైతులకు నీరు ఇవ్వలేమని అధికారులు చెబుతున్నారు.
వైసీపీ నాయకులకు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. 'వైసీపీ నాయకులు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి. రాష్ట్రానికి ఎంతో మంచి చేసిన చంద్రబాబు నాయుడునే జైలుకు పంపించినప్పుడు భవిష్యత్‌లో మీ పరిస్థితి ఏంటన్నది ఊహించుకోవాలి. ముఖ్యంగా ధర్మవరంలో అరాచకాలు చేస్తున్న వారు.. రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఊహించి మసులుకోవాలి.' అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
శ్రీసత్యసాయి జిల్లాలో బైక్‌పై వెళ్తున్న తల్లీ కుమారులపై కొంతమంది దుండగులు దాదాపు కి.మీ మేర వెంటపడి మరీ దాడి చేశారు. అగలి మండటం పి. బ్యాడిగెర సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.