Inter Student Suicide: ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏపీలో (AP) సంచలనం రేపింది. ఎన్నో ఆశలతో తనను చదివిస్తున్న పేరెంట్స్ కు ఆ యువతి తీరని శోకం మిగిల్చింది. ఉన్నట్టుండి శుక్రవారం రాత్రి బిల్డింగ్ మీదనుంచి దూకి చనిపోవడంతో అక్కడున్న తోటి విద్యార్థులు, సిబ్బంది ఉలిక్కి పడ్డారు. అయితే ఆ అమ్మాయి చావుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలువడలేదు.
పూర్తిగా చదవండి..నలంద కాలేజీలో ఘోరం.. ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకిన విద్యార్థిని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలోని నలంద కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. ఈ కళాశాలలోనే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సుధ అనే యువతి బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకి చనిపోయింది. ఆమె ఆత్మహత్యకు, కాలేజీకి ఎలాంటి సంబంధం లేదని ప్రిన్సిపల్ చెప్పినా పేరెంట్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Translate this News: