అనుమానంతో కట్టుకున్న భర్తను ఓ భార్య కిడ్నాప్ చేసిన ఘటన అనంతపురం జిల్లా కదిరిలో కలకలం సృష్టి్ంచింది. -అడ్డొచ్చిన అత్తమామలకు కూడా కోటింగ్ ఇచ్చిందా ఇల్లాలు. ఏకంగా 15మందితో వచ్చి భర్తను కిడ్నాప్ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఐదేళ్ల క్రితం మంజుల, ప్రవీణ్ కు వివాహం జరిగింది. కాలసముద్రంలో రైల్వే ఉద్యోగిగా ప్రవీణ్, తిరుచానూరు పీఎస్ లో కానిస్టేబుల్ గా మంజుల పనిచేస్తున్నారు. పెళ్లైన నాటి నుంచి ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో మంజులకు దూరంగా ఉంటూ వస్తున్నాడు ప్రవీణ్. పనిమనిషి చైతన్యతో భర్త అక్రమ సంబంధం పెట్టుకుని ఉంటున్నాడని మంజుల అనుమానం పెంచుకుంది. దీంతో భర్తతోపాటు పనిమనిషిని కూడా కిడ్నాప్ చేసింది మంజుల. ఈ ఘటనపై ప్రవీణ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారి ఫిర్యాదు మేరకు కదిరి పీఎస్ లో లేడీకానిస్టేబుల్ మంజులపై కేసు నమోదు చేశారు పోలీసులు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు నిందితుల కోసం గాలింపులు చేపట్టారు.
Anantapur : కదిరిలో కలకలం.. భర్తను కిడ్నాప్ చేసిన భార్య
అనుమానంతో కట్టుకున్న భర్తను ఓ భార్య కిడ్నాప్ చేసిన ఘటన అనంతపురం జిల్లా కదిరిలో కలకలం సృష్టి్ంచింది. -అడ్డొచ్చిన అత్తమామలకు కూడా కోటింగ్ ఇచ్చిందా ఇల్లాలు. ఏకంగా 15మందితో వచ్చి భర్తను కిడ్నాప్ చేసింది.
New Update
తాజా కథనాలు