అమరావతి అదిరిపోయే డ్రోన్ సమ్మిట్.. ఎప్పుడో తెలుసా?

ఏపీ ప్రభుత్వం ఈ నెల 22, 23 తేదీల్లో అమరావతి డ్రోన్ సమ్మిట్‌ను నిర్వహించనుంది. డ్రోన్ సాంకేతికత వినియోగం, ఎదురయ్యే సవాళ్లపై ఈ సమ్మిట్ లో చర్చించనున్నారు. దేశంలోని దాదాపు అన్ని డ్రోన్ తయారీ సంస్థలు, తయారీ నిపుణులు హాజరుకానున్నారు.

DRONE
New Update

ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ సమ్మిట్‌ను అక్టోబర్ 22, 23 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మంగళగిరి సీకే కన్వేన్సన్‌లో అమరావతి డ్రోన్ సమ్మిట్-2024ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి చెందిన డ్రోన్ సమ్మిట్ లోగో, వెబ్‌సైట్‌ను విజయవాడలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్, ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ ఎండీ దినేష్ కుమార్ ఆవిష్కరించారు.

ఇది కూడా చూడండి: కొండా సురేఖపై నాగార్జున కేసులో బిగ్‌ట్విస్ట్‌.. కోర్టు కీలక ఆదేశాలు

సీఎం చంద్రబాబు లక్ష్యం..

దినేష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జరగబోయే ఈ సమ్మిట్‌కి ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరవుతారని తెలిపారు. ఏపీ డ్రోన్ కేపిటల్‌గా మారాలన్నా సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని త్వరలో నెరవేరుస్తామని తెలిపారు. డ్రోన్ సాంకేతికత, వినియోగం, దానివల్ల ఎదురయ్యే సవాళ్లు వంటి అంశాలతో పాటు డ్రోన్‌లో తీసుకురావాల్సిన కొత్త టెక్నాలజీ కోసం చర్చిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని డ్రోన్ తయారీ సంస్థలు, డ్రోన్ తయారీ నిపుణులు ఈ సమ్మిట్‌లో పాల్గొంటారన్నారు. 

ఇది కూడా చూడండి: దసరా స్పెషల్.. ఈ వారం థియేటర్/ ఓటీటీలో సందడే సందడి..

అమరావతి డ్రోన్ సమ్మిట్‌కి వచ్చేవారు వెబ్‌సైట్‌లో ఈ నెల 15 వరకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 22వ తారీఖున విజయవాడలో 5 వేల డ్రోన్లతో హ్యాకథాన్‌ను నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఈ భారీ డ్రోన్ షోను ప్రజలు ఉచితంగా చూడవచ్చు. అలాగే డ్రోన్లు తయారు చేసిన వారికి మొదటి ముగ్గురికి నగదు బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు. మొదటి విజేతకు రూ.3 లక్షలు, రెండో బహుమతికి రూ.2 లక్షలు, మూడో బహుమతికి రూ.లక్ష బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. 

ఇది కూడా చూడండి: జానీ మాస్టర్ కేసు వెనుక కుట్ర జరుగుతోంది: శేఖర్ బాషా

#amaravati #drone-summit
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe