అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే రాజవోమ్మంగి మండలంలోని జడ్డంగి గ్రామ శివారులో మడేరు వాగు ప్రవహిస్తుంటుంది. ఆ వాగు ప్రవాహానికి ఆంజనేయ స్వామి విగ్రహం కొట్టుకువచ్చింది. వాగు వైపు వెళ్తున్న అజయ్ అనే యువకుడు ఇసుకలో ఒక్కసారిగా విగ్రహాన్ని చూసి షాక్ అయ్యాడు.
ఇది కూడా చూడండి: కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గేది లేదు: కొండా సురేఖ
ఆ ఆంజనేయుడే..
సాక్షాత్తూ ఆ ఆంజనేయస్వామి వారి గ్రామానికి వచ్చాడని భావించి.. వెంటనే గ్రామ ప్రజలకు సమాచారం ఇచ్చాడు. వాగులో కొట్టుకు వచ్చిన ఆంజనేయుని సమీపంలో ఉన్న రామాలయానికి తీసుకెళ్లి గ్రామస్థులు పూజలు చేయడం మొదలు పెట్టారు. ఇసుకలో నుంచి పుట్టిన ఈ విగ్రహాన్ని చూసి గ్రామానికి ఆంజనేయస్వామి వచ్చాడోచ్ అని గ్రామమంతా ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో అప్ల్‌లోడ్ చేశారు.
ఇది కూడా చూడండి: Nagarjuna: ప్లీజ్ ఇక ఈ విషయాన్ని వదిలేయండి..టీపీసీసీ చీఫ్ విజ్ఞప్తి!
రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా జడ్డంగి గ్రామంలో రహదారి పక్కన ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇటీవల అధికారులు తొలగించారు. ఎన్నో రోజులుగా పూజిస్తున్న ఆంజనేయ విగ్రహం లేదనే బాధ ఈరోజుతో తీరిందని అంటున్నారు. ఆ ఆంజనేయుడే బంగారు రూపంలో మళ్లీ గ్రామానికి వచ్చాడని భావిస్తున్నారు. గ్రామ ప్రజలను కాపాడేందుకు ఆంజనేయుడు మళ్లీ వచ్చాడని నమ్ముతున్నారు. త్వరలో గ్రామ పెద్దల సహకారంతో గుడి కట్టి విగ్రహా ప్రతిష్ట చేస్తామని గ్రామస్థులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: సారీ చెప్పిన వెన్కక్కి తగ్గేదిలే.. సురేఖకు లీగల్ నోటీసులు పంపనున్న నాగార్జున