/rtv/media/media_files/2025/02/17/jMQ58XyWVKLQOrFhTM6g.jpg)
Aghori Naga Sadhu
Aghori : తెలంగాణలో హఠాత్తుగా ప్రత్యక్షమై ఆ తర్వాత మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ, ఇప్పుడు సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తున్న అఘోరీ తాజాగా ఏపీలోకి ఎంటరైంది. కొంతకాలం మీడియాకు దూరంగా ఉన్న అఘోరీ మరోసారి రోడ్డుమీద ప్రత్యక్షమైంది. 16 నెంబర్ జాతీయ రహదారిపై వెళ్తూ బాపట్ల జిల్లా పంగులూరు మండలం జాగర్లమూడి వారి పాలెం వద్ద స్థానికులకు కనిపించింది. కారు ఆపుకొని సేద తీరుతుండగా స్థానికులు ఆమెను తమ కెమెరాల్లో బంధించడానికి ఆసక్తి చూపారు. గుంటూరు నుండి నెల్లూరు వైపు వెళ్తూ విరామం కోసం ఆగినట్లు తెలుస్తోంది.
అఘోరీ రోడ్డుమీద ఉందని తెలుసుకొని స్థానికులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరారు. అఘోరీని దగ్గరినుంచి చూడడానికి జనాలు ఆసక్తి చూపడంతో వచ్చినవారిపై అఘోరీ సీరియస్ అవ్వడంతో పాటు తిట్ల దండకం అందుకుంది. నెల్లూరు నుంచి తిరిగి ఎక్కడికి వెళ్తున్నారని స్థానికులు అడిగినప్పటికీ చెప్పడానికి ఆమె ఆసక్తి చూపలేదు.కాగా గత కొంతకాలంగా అఘోరీ రెండు తెలుగు రాష్ర్టా్ల్లో హల్ చల్ చేస్తోంది. సనాతనధర్మాన్ని కాపాడుతానంటూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తోంది. సనాతన ధర్మాన్ని కాపాడడానికి అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధమని ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆమె పై నిఘా పెట్టారు. ఇటీవల రామరాజ్యం వీరరాఘవరెడ్డి చేతిలో దాడికి గురైన చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులు రంగరాజన్ ను ఇటీవల పరమార్శించిన అఘోరీ ఇలాంటి దాడులు సరికాదని వ్యాఖ్యానించింది.
సికింద్రాబాద్‌లోని ఒక దేవాలయంలో విగ్రహం ధ్వంసం అయిన సందర్భంలో ప్రత్యక్షమైన అఘోరీ ఆ తర్వాత పలు సందర్భాల్లో తెలంగాణ, ఆంధ్ర లోని దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించింది. అయితే పూర్తి నగ్నంగా దేవాలయాలకు వస్తున్న సందర్భంలో కొన్నిచోట్ల ఆమెను అడ్డుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్న సాకుతో పలుమార్లు పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలేశారు. అయితే ఇటీవల అఘోరీ వాడుతున్న భాషమీదా పలు విమర్శలు వస్తున్నాయి. పోలీసులను సైతం నోటికొచ్చినట్లు తిడుతుండటాన్ని పలువురు తప్పుపడుతున్నారు.
Also Read : Health: నెలరోజులు క్రమం తప్పకుండ ఈ పండు తింటే...బరువు పెరగరు!