YS Jagan: అదానీ సంస్థ అవినీతి వ్యవహారంలో వైఎస్ జగన్ కు బిగ్ షాక్ తగిలింది. జగన్ కు అదానీ సంస్థ భారీ లంచం ఇచ్చినట్లు సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ వ్యవస్థాపకుడు నలమోతుచక్రవర్తి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అదానీ.. జగన్ కు రూ.1,750 కోట్ల రూపాయల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీ విచారణలో తేలినట్లు ఫిర్యాదులో చక్రవర్తి పేర్కొన్నారు. అంతేకాదు అదానీ కంపెనీ సోలార్ పవర్ అగ్రిమెంట్ పై విచారణ జరిపి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
8 మందిపై కేసు నమోదు..
ఇదిలా ఉంటే.. అదానీ, జగన్ అమెరికా కేసు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. కాగా ఈ వ్యవహారంపై దర్యాప్తు కోరుతూ విశాల్ తివారీ పిటిషన్ వేశారు. ఇండియాలో సోలార్ ఎనర్జీ అగ్రిమెంట్ కోసం అదానీ గ్రూపు రూ. 2,029 కోట్లు లంచం ఇచ్చినట్లు అమెరికాలో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా మొత్తం 8 మందిపై కేసు నమోదైంది.
ఇది కూడా చదవండి: కుల గణనపై సీఎం రేవంత్ సంచలన ప్రకటన!
2021-24 మధ్య కాలంలో అప్పటి ఏపీ సీఎం జగన్ ప్రభుత్వంతో పాటు మరో 5 రాష్ట్ర ప్రభుత్వాల్లోని కీలక వ్యక్తులకు రూ. 2,029 కోట్లు అదానీ లంచం ఇచ్చినట్లు అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ప్రకటించింది. అందులో రూ. 1750 కోట్లు ఏపీ ప్రభుత్వ వ్యక్తికి చెల్లించినట్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: కేకేఆర్ కెప్టెన్ గా భారత సీనియర్ ప్లేయర్.. రూ.1.75 కోట్లకే పగ్గాలు!