ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. 32 మందిని ట్రాన్స్ ఫర్ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి నారా లోకేష్ భేటీ
మొత్తం ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లకు ఏపీ సీఆర్డీఏలో పోస్టింగ్ ఇచ్చారు. ప్రోటోకాల్ డైరెక్టర్ గా మోహన్ రావును నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Also Read: రేవంత్ సర్కార్ శుభవార్త.. విద్యుత్ బిల్లుల పెంపుపై కీలక నిర్ణయం
ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పి. రచనను ఈ సందర్భంగా నియమించారు. శ్రీకాళహస్తి దేవాలయం ఈవోగా బాపిరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ శిల్పారామం సొసైటి సీఈవో గా స్వామి నాయుడును నియమించారు. సీసీఎల్ ఏ సహాయ కార్యదర్శిగా లక్ష్మారెడ్డి ని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
Also Read: చిరు వర్సెస్ మోహన్ బాబు..మరోసారి తెరపైకి లెజెండరీ అవార్డు వివాదం
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. డిప్యూటీ కలెక్టర్లు బదిలీ
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ట్రాన్స్‌ఫర్ చేసింది. మొత్తం 47 మంది డిప్యూటీ, 23 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లాల అదనపు కలెక్టర్లు, 4 జిల్లాల డీఆర్వోలు బదిలీ చేయారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారీ ఉత్తర్వులు జారీ చేశారు.
రెవెన్యూశాఖ ప్రక్షాళన
ఇందులో భాగంగా జగిత్యాలలో డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న పి.రాంబాబు సూర్యా పేట జిల్లాకు బదిలీ అయ్యారు. ఇక సూర్యాపేట జిల్లాలో విధులు నిర్వహిస్తున్న అదనపు కలెక్టర్ బీఎస్ లతను జగిత్యాల జిల్లాకు ట్రాన్స్‌ఫర్ చేశారు. తెలంగాణలో రెవెన్యూశాఖ ప్రక్షాళనకు మంత్రి పొంగులేటీ శ్రీకారం చుట్టారు. ఏకంగా ఒకేసారి 70 మంది డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవలే రెవెన్యూ సంఘాలు పదోన్నతులు, బదిలీలపై మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పొంగులేటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదనపు కలెక్టర్లు, ఆర్టీవోలు, భూసేకరణ అధికారులు, అలాగే సివిల్ సప్లయిస్ వంటి శాఖాల్లో కూడా పనిచేస్తున్న వారని బదిలీ చేయడం చర్చనీయమవుతోంది.
Also Read: ఆ గ్రామంలో దెయ్యాలు..వెళ్లాలంటే హాడల్!
కొందరు అధికారులకు కోరుకున్న ప్రాంతాలు వచ్చాయి. మరికొందరు ఊహించని ప్రాంతాలకు బదిలీ అయ్యారు. వాళ్లు కోరుకున్న స్థానాలు దక్కలేదు. మరికొందరికైతే వారు ఆశించని విధంగా కూడా ప్రాధాన్యత ఉన్న డివిజన్లకు ట్రాన్స్‌ఫర్ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న పది మంది ఆర్డీవోలకు కూడా పోస్టింగ్స్ లభించడం విశేషం. అయితే డిప్యూటీ కలెక్టర్లయిన ఎల్.రమేష్, ఎన్. ఆనంద్ కుమార్, హన్మనాయక్‌కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. వాళ్లని రెవెన్యూశాఖలోనే రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.