Tamilanadu: ఆ గ్రామంలో దెయ్యాలు..వెళ్లాలంటే హాడల్‌!

తమిళనాడు, ట్యూటికోరిన్ జిల్లాలో మీనాక్షిపురం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక్కొక్కరుగా వరుసపెట్టి చనిపోయారు. దీంతో ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది. అసలక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌ లోకి వెళ్లండి..

New Update

Tamilanadu: తమిళనాడులోని ఒక విలేజ్‌కి వెళ్లాలంటే ప్రజలు భయంతో వణికి వణికిపోతున్నారు. అసలు అక్కడికి వెళ్ళడానికి ప్రజలు ఎందుకు భయపడతారు? అందులో దెయ్యాలు ఉన్నాయా..? అయితే, తమిళనాడు, ట్యూటికోరిన్ జిల్లాలో మీనాక్షిపురం అనే ఒక గ్రామం ఉంది. ఈ గ్రామం ఒకప్పుడు జనంతో కళకళలాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ శిథిలాలు మాత్రమే మిగిలాయి. 

మీనాక్షిపురం గ్రామం హాంటెడ్ ప్లేస్ అని చెప్పడానికి కారణం, అక్కడ నివసించిన వారు వరుసపెట్టి అకస్మాత్తుగా చనిపోవడమే. దీంతో గ్రామస్థులు భయపడి వేరే చోటుకు వెళ్లిపోయారు. కాలక్రమేణా గ్రామం ఖాళీ అయిపోయింది. చివరికి దెయ్యాల గ్రామంగా దీనికి ఒక భయానక పేరు వచ్చింది. ఆ ఊరి ప్రజలు గ్రామదేవతలకు కోపం తెప్పించారనీ, అందుకే దేవుళ్లు ఈ గ్రామాన్ని శపించారని కొంతమంది చెబుతుంటారు.

Advertisment
తాజా కథనాలు