AP POLITICS : ఆంధ్రప్రదేశ్ ను ఆ రెండు పార్టీలు మోసం చేశాయి- RTV తో జేడీ సంచలన వ్యాఖ్యలు!

ఆంధ్రప్రధేశ్ రాజకీయాల్లో చర్చనీంశంగా మారిన అంశం ప్రత్యేక హోదా. ఈ అంశాన్ని ప్రధానంగా చేసుకుని  ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో చేర్చిన రాష్ట్రంలోని రెండు పార్టీలు ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను మోసం చేసారని జేడీ విమర్శించారు.ఇంకా పలు అంశాల పట్ల RTV తో జేడీ మాట్లాడారు.

JD Lakshmi Narayana: బీఆర్ఎస్ అభ్యర్థికి నా మద్దతు.. జేడీ లక్ష్మీనారాయణ కీలక ప్రకటన
New Update

ప్రత్యేక హోదా బలవంతంగా ముగిసిన అధ్యాయం

తెలుగు రాష్ట్రాల విభజన అనంతరం ఆంధ్రప్రధేశ్ రాజకీయాల్లో చర్చనీంశంగా మారిన అంశం ప్రత్యేక హోదా. ఈ అంశాన్ని ప్రధానంగా చేసుకుని  ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో చేర్చిన రాజకీయ నాయకులు .. అధికారం చేపట్టిన తరువాత ఆంధ్ర ప్రదేశ్కు ప్రత్యేక హోదా అనే అంశాన్ని గాలికొదిలేశారు. ఇప్పుడు ఈ అంశం పైనే జేడీ లక్ష్మీ నారాయణ (JD Lakshmi Narayana) స్పందిస్తూ .. ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం కాదని , బలవంతంగా ముగిసిన అధ్యాయం అని అన్నారు.

రెండు పార్టీలు మోసం చేసాయి 

రాష్ట్రంలోని రెండు పార్టీలు ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను మోసం చేసారని , ఇప్పుడు ఎన్నికల సమయంలో మళ్ళీ ప్రత్యేక హోదా అంశం తెర మీదకు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ప్రత్యేక హోదా కావాలని. ప్రత్యేక హోదా  ఎన్నికలకు ముందే సాధించుకోవాలని అన్నారు. ఆనాడు మెడలు వంచి హోదా తెస్తామని చెప్పిన సీఎం.. ఇప్పుడు సార్ సార్ అంటూ మోడీ (PM Modi) చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తమిళనాడులో జల్లికట్టు ఏ విధంగా సాధించారో మన ఏపీ కూడా హోదా సాధించుకోవాలి...దీనికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.

ఏపీని  అంధకారం నుంచి బయటకు తీసుకురావడానికి జేబీఎన్‌పీ కృషి

అవినీతి మరియు బానిసత్వం నుండి ప్రజలను విముక్తి చేయడమే  ప్రధాన ఎజెండాగా జేడీ లక్ష్మీనారాయణ నెలకొల్పిన జై భారత్ నేషనల్ పార్టీ (జెబిఎన్‌పి)  ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలపై వంశపారంపర్య రాజకీయ పార్టీల చుట్టూనే వర్తమాన రాజకీయాలు నడుస్తున్నాయని విమర్శించారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నందుకు పార్టీలు ఒకరినొకరు నిందించుకుంటున్నాయని అన్నారు.'సుపరిపాలన అందించడమే ప్రధాన లక్ష్యం గా  JBNP స్థాపించడం జరిగిందని , రాజకీయం అంటే సుపరిపాలన అని రుజువు చేసేదిశగా అడుగులు వేస్తున్నామని పార్టీ ఆవిర్భావ సభలో జేడీ మాట్లాడిన విషయం తెల్సిందే.  రాష్ట్రాన్ని అంధకారం నుంచి బయటకు తీసుకురావడానికి జేబీఎన్‌పీ కృషి చేస్తుందని, అవినీతిని అంతమొందించడంపై దృష్టి సారిస్తుందని చెప్పారు.ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ను పట్టి పీడిస్తోన్న నిరుద్యోగం, ప్రత్యేక హోదాపై జై భారత్ నేషనల్ పార్టీ ఫోకస్ చేస్తోందని అన్నారు. లక్ష్మీనారాయణ 2019 సార్వత్రిక ఎన్నికలలో విశాఖపట్నం నియోజకవర్గం నుండి జనసేన పార్టీ నుండి పోటీ చేసి 2020లో JSP నుండి నిష్క్రమించారు.

ALSO READ : నాలుగు రోజులుగా జిల్లాలో పులి సంచారం.. వణికిపోతున్న జనం!

#jd-lakshmi-narayana #ap-politics #janasena #ap-cm-ys-jagan #jai-bharat-national-party
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe