ఆదివారం సాయంత్రం ఏపీలో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటికే 15 మంది మరణించగా..వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అనేక మంది గాయపడ్డారు. వారందరినీ కూడా స్థానిక ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం గురించి ప్రతిపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు కురిపిస్తున్నారు.
దీని గురించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. రైల్వే శాఖ నిద్ర నుంచి ఎప్పుడు మేల్కొంటుందని ఆమె ప్రశ్నించారు. దేశంలో తరచూ ఇలాంటి రైలు ప్రమాదాలు జరుగుతుండడం చాలా ఆందోళనకరమని ఆమె పేర్కొన్నారు. తరచూ రైళ్లు ఢీకొనడం, కోచ్ లు పట్టాలు తప్పడం, కోచ్ లలో చిక్కుకున్న నిస్సహాయ ప్రయాణికులు.. ఇలా పదేపదే జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.
Also read: బీఆర్‌ఎస్ లోకి కాంగ్రెస్ వలసలు!
బాధిత కుంటుంబాలకు అందరూ సహయం చేయాలని ఆమె అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో కోరారు. ఈ ప్రమాదం గురించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. రైల్వే శాఖ నిద్ర మత్తు నుంచి ఎప్పుడు బయటపడుతుందని ప్రశ్నించారు. ఈ రైలు ప్రమాదం చాలా బాధాకరం అంటూ ఆయన పేర్కొన్నారు.
‘ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ రైలు ప్రమాదం చాలా బాధాకరం. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో రాశారు.
Also read: బాదం పప్పును నానబెట్టకుండా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు!
ఈ ప్రమాదం గురించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాట్లాడారు. దేశంలో ఇలాంటి రైలు ప్రమాదాలు పదేపదే జరగడం చాలా ఆందోళన కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. రైలు భద్రతా చర్యలను కేంద్రం ప్రభుత్వం వెంటనే పరిశీలించాలని పేర్కొన్నారు. “జూన్ 2023లో బాలాసోర్ రైలు ప్రమాదం జరిగిన కొద్ది నెలలకే, ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయనగరంలో జరిగిన రైలు ఢీకొనడం వల్ల నేను తీవ్ర మనోవేదనకు గురయ్యాను, నా ఆలోచనలు బాధిత కుటుంబాలతో ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నాను. ” అంటూ ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.