Tirupati: తిరుపతిలో కిడ్నాప్ కలకలం. ఎలా జరిగిందే..?

తిరుమల అంటేనే ఒక్కసారిగా ఒళ్ళు జలకరించాల్సిందే. గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తే శ్రీవారి భక్తులకు వణికిపోవాల్సిందే. తిరుమలలో ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. ఈమధ్య చిరుతలు, ఎలుగుబంట్లు, ప్రాణపోయిన సందర్భాలను చూశాం. తిరుమలకు వెళ్తే.. ప్రాణాలతో తిరిగి వస్తామా..!! అనే భయం శ్రీవారి భక్తులకు వస్తోంది. తాజాగా మరో ఘటనతో తిరుమలలో కలకలం రేపుతోంది.

Tirupati: తిరుపతిలో కిడ్నాప్ కలకలం. ఎలా జరిగిందే..?
New Update

తిరుపతిలో ఓ బాలుడు కిడ్నాప్ కు గురైన ఘటన కలకలం రేపుతోంది. తిరుమల ఆర్టీసీ బస్టాండ్‌లో అర్థరాత్రి రెండేళ్ల బాబు కిడ్నాప్‌కు గురయ్యాడు. ఈ ఘటన నిన్న రాత్రి రెండు గంటల సమయంలో రిజర్వేషన్ కౌంటర్ దగ్గర చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. సోమవారం శ్రీవారి దర్శనానికి చెన్నైకి చెందిన చంద్రశేఖర్-మీనా దంపతులు తమ రెండో కుమారుడు మురుగేశన్‌ తో కలిసి వచ్చారు.  అయితే.. అర్ధరాత్రి 2.20 గంటల సమయంలో ఆ బాలుగు కిడ్నాప్ కు గురైనట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాపర్ వయస్సు సుమారు32 సంవత్సరాలు ఉండవచ్చు అని పోలీసులు వెల్లడించారు. కిడ్నాపర్ వైట్ షూ, గ్రీన్ కలర్ షర్ట్‌తో వేసుకుని ఉన్నాడని తెలిపారు. రిజర్వేషన్ కౌంటర్ నుంచి బాలుడ్ని బస్టాండ్ బయట గల అంబేద్కర్ విగ్రహం వైపు ఆ కిడ్నాపర్ తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసులు వివరాల ప్రకారం.. వరుస సెలవుల నేపథ్యంలో చెన్నైకి చెందిన ఒక కుటుంబం మూడు రోజుల క్రితం తిరుమలకు వచ్చింది. స్వామి వారి దర్శనం ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లడానికి సిద్ధం అవుతున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో వారు చెన్నై బస్ కోసం ఎదురుచూస్తుండగా బాలుడి కిడ్నాప్ జరిగింది. అప్పటివరకు కూడా పిల్లోడిని ఎంతో జాగ్రత్తగా తండ్రి చూసుకున్నట్లుగా కూడా సీసీ టీవీ ఫుటేజ్ లో స్పష్టం అవుతోంది. అదే సమయంలో పిల్లోడికి ఆకలిగా ఉంటే.. కొన్ని తినుబండారాలు, పాలు అలాంటివి కొనేందుకు తండ్రి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. పిల్లలకి కావలసిన కొనిచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి తండ్రి అక్కడే కొద్దిసేపు బస్ కోసం ఎదరు చూశారు. బస్సు రాకపోవటంతో కొంచెం రెస్ట్ తీసుకుందామని అలా కాసేపు పడుకున్నారు.

This browser does not support the video element.

తల్లిదండ్రులు నిద్రపోతున్నది చూసి.. ఇంతలో బస్టాండ్ ఆవరణంలో తిరుగుతున్న దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. 2 గంటల సమయంలో బాబుని కిడ్నాప్ చేశారు. బాబు ఎత్తుకెళ్ళిన ఇద్దరూ అనుమానితులను పోలీసులు గుర్తించారు. ఇక.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఐదు బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నాయి. వెంటనే సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించారు పోలీసు అధికారులు. బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న ప్రతి సీసీ ఫుటేజ్‌ని, షాపులు, ఖాళీ ప్రదేశాలు అన్నిటిని పోలీసుల బృందాలతో తనిఖీ చేయించారు. బాబు మిస్ అయిన తర్వాత ఏ బస్సులు బయల్దేరాయి..? కిడ్నాపర్ బాబును తీసుకొని ఏ వైపు వెళ్ళాడు..? అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. బాబు మిస్ అవ్వడంతో తల్లిదండ్రులు తిరుపతిలోనే ఆగిపోయారు. శ్రీవారి దర్శనానికి వచ్చి సంతోషంగా తిరిగి వెళ్తున్న ఈ తరుణంలో బాబు మిస్ కావడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే కేసును ఛేదించి బాలుడి తల్లిదండ్రులకు అప్పగించడమే లక్ష్యంగా పోలీసులు పని చేస్తున్నారు.

#tirupati #chennai #kidnapping #chandrasekhar-meena #two-years-murugesan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe