SI Jobs Updates: ఎస్ఐ అభ్యర్థులకు అలర్ట్.. రిక్రూట్మెంట్ బోర్డు కీలక ప్రకటన

ఏపీలో ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్షలు పూర్తయ్యాయి. పేపర్ 3,4 పరీక్షల ప్రశ్నపత్రాలతో సహా.. ప్రాథమిక కీ లను ఏపీ ఎస్‌ఎల్‌పీఆర్‌బీ (APSLPRB) విడుదల చేసింది. అలాగే సమాధానాలకు సంబంధించి అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అక్టోబర్ 18 సాయంత్రం 5 గంటల్లోగా నిర్ణీత ఫార్మాట్‌లో మెయిల్‌కు పంపాలని తెలిపింది. ప్రశ్నా పత్రాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

New Update
SI Jobs Updates: ఎస్ఐ అభ్యర్థులకు అలర్ట్.. రిక్రూట్మెంట్ బోర్డు కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. శని, ఆదివారాల్లో విశాఖ, గుంటూ, కర్నూల్, ఏలూరు నగరాల్లో ఈ పరీక్షలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షలు రాసేందుకు 31,193 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. శనివారం రోజు జరిగిన పేపర్‌-1 (ఇంగ్లిష్‌), పేపర్‌-2 (తెలుగు) పరీక్షలకు 30,585 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 608 మంది గైర్హాజరయ్యారు. ఆదివారం రోజున నిర్హహించిన పేపర్‌-3 (అరిథ్‌మెటిక్‌, మెంటల్‌ ఎబిలిటీ) పరీక్షకు 30,569 మంది, పేపర్‌-4(జనరల్‌ స్టడీస్‌) పరీక్షలకు 30,560 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

అయితే పేపర్ 3,4 పరీక్షల ప్రశ్నపత్రాలతో సహా.. ప్రాథమిక కీ లను ఏపీ ఎస్‌ఎల్‌పీఆర్‌బీ (APSLPRB) విడుదల చేసింది. అలాగే సమాధానాలకు సంబంధించి అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అక్టోబర్ 18 సాయంత్రం 5 గంటల్లోగా నిర్ణీత ఫార్మాట్‌లో [email protected]కు మెయిల్‌లో పంపాలని సూచనలు చేసింది. ఆ తర్వాత తుది కీ తో పాటు ఫలితాలు కూడా ప్రకటించనుంది ఏపీ ఎస్‌ఎల్‌పీఆర్‌బీ. ఆ తర్వాత తుది 'కీ' తో పాటు ఫలితాలు వెలువరించనున్నారు. ప్రశ్నా పత్రాలను అధికారిక వెబ్‌సైట్‌లో https://slprb.ap.gov.in/ అందుబాటులో ఉంచారు.

పేపర్ 3 ప్రిలిమినరీ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పేపర్ 4 ప్రిలిమినరీ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read: ఇంటర్ పూర్తి చేసినవారికి గుడ్ న్యూస్…కేవల రూ. 50 కడితే చాలు..జాబ్ గ్యారెంటీ..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు