Narayana: ఆ రోజు నుంచే అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం: మంత్రి నారాయణ

డిసెంబరు 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ వెల్లడించారు. నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం రూ.60 వేల కోట్లు ఖర్చవుతుందని నారాయణ పేర్కొన్నారు.

New Update
TDP Narayana: బాబు షూరిటీ - భ‌విష్య‌త్ గ్యారెంటీ:  మాజీ మంత్రి నారాయ‌ణ

Minister Narayana: నేడు కృష్ణా జిల్లా కంకిపాడులో క్రెడాయ్ సౌత్ కాన్ - 2024 సదస్సు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రజలకు శుభవార్త తెలిపారు. డిసెంబరు 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ  వెల్లడించారు.

Also Read: అత్తమామల ఆస్తిపై కన్నేసిన భర్త.. అందుకు ఒప్పుకోలేదని భార్యను ఏం చేశాడంటే..!

నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం రూ. 60 వేల కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నామన్నారు.  ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా ఏపీ రాజధాని అమరావతిని తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. అమరావతి సహా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

Also Read: డాక్టర్‌ నిర్లక్ష్యం.. కూర్చున్న కుర్చీలోనే ప్రసవించిన గర్భిణి..!

నిర్మాణ రంగ అభివృద్ధికి అధికారులతో సమీక్షిస్తున్నామని వ్యాఖ్యానించారు. సింగిల్ విండో అనుమతుల విధానానికి తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. బిల్డర్లకు సత్వరమే అనుమతులు మంజూరు చేసేందుకు ఓ సాఫ్ట్ వేర్ ను తీసుకువస్తామని మంత్రి వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు