Andhra Pradesh : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఈ డైరెక్ట్ లింక్ తో రిజల్ట్స్!

ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ మొదటి, రెండో సంపవత్సరాలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేశారు. దాదాపు 9 లక్షల మంది తాలూకా ఇంటర్ ఫలితాలు ఈరోజు విడుదల అయ్యాయి. ఫలితాలను కింది లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చును.

New Update
Andhra Pradesh : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఈ డైరెక్ట్ లింక్ తో రిజల్ట్స్!

Inter Results : ఏపీ(Andhra Pradesh) లో ఇంటర్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. వారందరి ఎదురుచూపులకు ఇవాళ ఫలితం దక్కింది. తాడేపల్లిలో ఇంటర్ బోర్డు కార్యదర్శి ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఒకేసారి వెల్లడించారు. ఈ మేరకు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది రెగ్యులర్‌, ఒకేషనల్‌ విద్యార్థులు కలిపి మొత్తం 10,52,673 మంది విద్యార్ధులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో ఫస్ట్ ఇయర్ పరీక్షలు 5,17,617 మంది, సెకండ్ ఇయర్ పరీక్షలు 5,35,056 మంది విద్యార్ధులు రాశారు. 52,900 మంది విద్యార్ధులు పరీక్షలకు గైర్హాజరైనట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఈ ఫలితాలను ఇంటర్ బోర్డ్ కార్యదర్శి, పరీక్షల కన్వీనర్ విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల్లో 67శాతం ఉత్తీర్ణత రాగా..రెండో సంవత్సరం ఫలితాల్లో 78 శాతం వచ్చింది.

ఇక ఇంటర్‌ ఫలితాల(AP Inter Results 2024) కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులపై ఎన్నికల ప్రభావం ఉండకుండా, ఎన్నికలకు ముందే ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్(Election Code) అమల్లో ఉండటంతో ఫలితాల వెల్లడిపై ఈసీ ఆమోదం తప్పనిసరి. దీంతో విద్యాశాఖ ఈ మేరకు ఈసీ ఆమోదం కోరినట్లు సమాచారం.

ఆన్‌లైన్‌ ద్వారా ఫలితాలు..
పరీక్షా ఫలితాల కోసం విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీని అధికారిక ‘Board of Intermediate Education Andhra Pradesh’(BIEAP) వెబ్‌సైట్‌లో నమోదు చేసి ఆన్‌లైన్‌ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చును. ఫలితాల కోసం ఈ కింది వెబ్ సైట్లను సందర్శించవచ్చును.

results.gov.in

results.bie.ap.gov.in

examsresults.ap.nic.in

results.apcfss.in bie.ap.gov.in

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisment
Advertisment
తాజా కథనాలు