కాపురంలో చిచ్చు పెట్టిన అనుమానం.. భార్యను 12 సార్లు పొడిచి.. ఆ పై తాను కూడా!

పచ్చని కాపురంలో అనుమానం పెనుభూతమై రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఏపీలోని గుడివాడలో భర్త తన భార్యను అతి దారుణంగా 12 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఆపై తాను కూడా పురుగుల మందు తాగి చనిపోయాడు.

కాపురంలో చిచ్చు పెట్టిన అనుమానం.. భార్యను 12 సార్లు పొడిచి.. ఆ పై తాను కూడా!
New Update

పచ్చని కాపురంలోకి అనుమానమనే భూతం వచ్చి చేరింది. ఈ భూతం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఓ చిన్నారిని అనాథగా మిగిల్చింది. భార్య పై అనుమానంతో భర్త కత్తితో 12 సార్లు పొడిచి చంపి తాను పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడ లో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడివాడలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన రామలక్ష్మికి గోదావరి జిల్లా అప్పన్నపేటకు చెందిన తాతపూడి సూర్యనారాయణతో 6 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి హేమాన్ష్‌ అనే నాలుగు సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. గత కొంత కాలం నుంచి సూర్యనారాయణకు తన భార్య పై అనుమానం పెనుభూతమై కూర్చుంది. ఆమె బయటకి వెళ్తే చాలా అనుమానించడం మొదలు పెట్టాడు.

ఈ క్రమంలోనే భర్త రామ లక్ష్మి మీద చేయి చేసుకోవడంతో ఆమె తన పుట్టింటికి వచ్చేసింది. పెద్దలు నచ్చ జెప్పి మరోసారి ఇలాంటివి జరగకూడదని సర్ది చెప్పి పంపించారు. మళ్లీ సూర్యనారయణ తన భార్యను అనుమానిస్తూ హింసించడం మొదలు పెట్టాడు. దాంతో రామలక్ష్మి ఈ ఏడాది ఆగస్టులో గణపవరం పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసి పుట్టింటికి వెళ్లిపోయింది.

అల్లుడు ఇంటికి వస్తే మాట్లాడి కాపురానికి పంపించాలని అత్తమామలు అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే సూర్యనారాయణ ఆదివారం తన వెంట తీసుకుని వచ్చిన కత్తితో రామలక్ష్మిపై దాడి చేశాడు. 12 సార్లు పొడి పొడిచి చంపాడు. కూతురు అరుపులు విన్న ఆమె తండ్రి వెంకన్న అక్కడికి వచ్చే సరికి రామలక్ష్మి రక్తపు మడుగులో కూలిపోయింది.

వెంటనే 108 కి కాల్ చేసి గుడివాడ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ రామలక్ష్మి చనిపోయింది. మరోవైపు సూర్యనారాయణ తనతోపాటు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అనుమానంతో పచ్చని కాపురం నిప్పులు పోసుకున్నారని.. కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు.

Also read: ఈసారి పేటీఎం వంతు..ఒకేసారి 1000 మంది ఉద్యోగులకు ఉద్వాసన!

#murder #andhrapradesh #gudivada
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe