Drugs in AP : మాదక ద్రవ్యాలకు కేరాఫ్ అడ్రస్ గా ఏపీ.. పార్లమెంట్ సాక్షిగా వెలువడిన లెక్కలు!

పార్లమెంట్ సాక్షి గా వెల్లడైన వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే.. షాక్ కి లోనవ్వడం ఖాయం. 2019వ సంవత్సరంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై 431 కేసులు నమోదు కాగా, 2020లో 602 కేసులు, 2021లో 1085 కేసుల నమోదయ్యాయి. అన్‌ స్టార్డ్ ప్రశ్నకు రాజ్యసభ పై గణాంకాలను వెల్లడించింది. ఆంధ్ర ప్రదేశ్ మాదకద్రవ్యాల హబ్ గా మారిందని ఇప్పటికే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఈ గణాంకాలు బలం చేకూరుస్తున్నాయి. మరి దీనిపై జగన్ ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.

New Update
Drugs in AP : మాదక ద్రవ్యాలకు కేరాఫ్ అడ్రస్ గా ఏపీ.. పార్లమెంట్ సాక్షిగా వెలువడిన లెక్కలు!

Drugs in AP: ఆంధ్రప్రదేశ్ రాజకీయం రచ్చకెక్కింది. ఎన్నికలు దగ్గర పెరుగుతున్న కొద్దీ ఏపీ వాతావరణం మరింత వేడెక్కుతోంది. విమర్శలతో హీట్ ఎక్కుతంది ఆంధ్ర ప్రదేశ్. రాజకీయ విమర్శలు కాస్తా పర్సనల్ విషయాల వరకూ వెళ్తుంది. వైసీపీ (YCP Govt) ప్రభుత్వాన్ని ఎలాగైనా ఈ సారి ఓడించాలని అటు టీడీపీ.. ఇటు జనసేన (Janasena) తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాను ప్రజల్లోకి తీసుకెళ్తారు. వైసీపీ సర్కార్ కూడా మరోసారి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మొత్తానికి మూడు పార్టీల నేతలు విమర్శలకు పదును పెడుతున్నారు.

ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) మాదక ద్రవ్యాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోందని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. పలు చోట్ల మాదక ద్రవ్యాలతో వెళ్తున్న వెహికల్స్ కూడా పట్టుబడిన సంఘటనలు చాలా ఉన్నాయి. దీనిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. కానీ ప్రభుత్వం మాత్రం దీనిని లైట్ గా తీసి పారేస్తుంది. అదేమీ లేదంటూ కొట్టి పడేస్తుంది.

అయితే శుక్రవారం పార్లెమెంట్ సాక్షిగా ఏపీ బాగోతం బట్టబయలైంది. ఏపీలో ప్రతి ఏటా మాదక ద్రవ్యాలు, గంజాయి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇందుకు సంబంధించి కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిదనే విషయాన్ని ఈ లెక్కలు చెబుతున్నాయి.

పార్లమెంట్ సాక్షి గా వెల్లడైన వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే.. షాక్ కి లోనవ్వడం ఖాయం. 2019వ సంవత్సరంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై 431 కేసులు నమోదు కాగా, 2020లో 602 కేసులు, 2021లో 1085 కేసుల నమోదయ్యాయి. అన్‌ స్టార్డ్ ప్రశ్నకు రాజ్యసభ పై గణాంకాలను వెల్లడించింది. ఆంధ్ర ప్రదేశ్ (AP)మాదకద్రవ్యాల హబ్ గా మారిందని ఇప్పటికే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఈ గణాంకాలు బలం చేకూరుస్తున్నాయి. మరి దీనిపై జగన్ ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.

Also Read: కోనసీమలో జగన్‌ పర్యటన..సున్నా వడ్డీ పథకం నిధుల విడుదల!

Advertisment
Advertisment
తాజా కథనాలు