గుడ్ న్యూస్.. నేడు వారి ఖాతాల్లో డబ్బులు జమ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ వైఎస్‌ఆర్ షాదీ తోఫా, కళ్యాణమస్తు నిధులను విడుదల చేయనున్నారు. 10,511 జంటలకు రూ. 81.64 కోట్ల సాయం అందజేయనున్నారు. ఈ నిధులు నేరుగా వధువుల ఖాతాల్లోనే జమ కానున్నాయి.

New Update
CM Jagan: విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టును అనుమతి కోరిన జగన్‌

Andhra Pradesh: పేదింటి ఆడ బిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలుస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇవాళ వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులకు అందజేయనున్నారు సీఎం. గురువారం ఉదయం 11 గంటలకు లబ్ధిదారుల ఖాతాల్లో వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా నిధులను విడుదల చేస్తారు. 10,511 జంటలకు సంబంధించిన రూ. 81.64 కోట్ల సాయం విడుదల చేయనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఈ నిధులను విడుదల చేయనున్నారు సీఎం జగన్. వధువుల ఖాతాల్లోనే నేరుగా ఈ డబ్బులు జమ కానున్నాయి.

పేద ప్రజల ఆడ బిడ్డల పెళ్లిళ్లకు అండగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కళ్యాణమస్తు, మైనార్టీల కోసం వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాలతో ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఇప్పటి వరకు 46,062 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.348.84 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. ఇక ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే.. పెళ్లి నాటికి అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే.. వధూవరులిద్దరూ 10 వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

Also Read:

బాబోయ్ అన్ని కోట్లా?.. వివేక్‌కు ఈడీ బిగ్ షాక్.. డ్రామా మొత్తం రివీల్..

 ప్రతి గురువారం విష్ణువును ఇలా పూజించండి.. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయ్..!

Advertisment