Andhra Pradesh Politics: ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh)ను అరెస్టు చేసేందుకు సీఐడీ(CID) పక్కా ప్లాన్‌తో ముందుకు వెళుతున్నట్లు సమాచారం. యువగళం(Yuvagalam) పాదయాత్ర తర్వాత నారా లోకేష్ గ్రాఫ్ పెరగడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందారు. అలాగే అన్ని విషయాలకు సంబంధించి ఈ పాదయాత్రలో పూర్తి అధ్యయనం చేసినట్లు పలు ఇంటర్వ్యూలలోనూ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ సందర్భంగా రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడంటూ పిటిషన్‌లో తెలిపింది. గతంలో పలు కేసుల్లో ఆయనకు కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించారని.. ఈ మేరకు ఆయనను అరెస్టు చేసేందుకు అనుమతివ్వాలని పిటిషన్ వేసింది. ముందు నోటీసులు ఇవ్వాలని న్యాయమూర్తి సీఐడీని ఆదేశించారు. అనంతరం కేసును జనవరి 9కి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ అధికారులు గురువారం నాడు ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న లోకేష్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయన లేకపోవడంతో వెనక్కు తిరిగి వచ్చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు ఆయనకు వాట్సాప్‌లో నోటీసులు అందజేశారు. దీనికి లోకేష్ సమాధానం ఇచ్చారు. నోటీసులు అందాయని తెలిపారు.
లోకేష్ ఎలా స్పందిస్తారో..?
ఈ నేపథ్యంలో సీఐడీ నోటీసులకు నారా లోకేష్ ఎలా రియాక్ట్ అవుతారు? కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఏపీ పాలిటిక్స్ లో ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉంటే.. సీఐడీ కేసులను ప్రభావితం చేసేలా లోకేష్ వ్యాఖ్యలు చేశారని సీఐడీ ఆరోపిస్తోంది. ఎక్కడ ప్రచార చేసినా.. ఎక్కడ ప్రసగించినా.. ఏ టీవీలకైనా ఇంటర్వ్యూలు ఇచ్చినా రెడ్ బుక్‌ను చూపిస్తూ అధికారులను బెదిరిస్తున్నారనేది సీఐడీ ఆరోపణ. అయితే జనవరి 9న న్యాయస్థానంలో ఏం జరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది.
రెడ్ బుక్ అంటే ఏంటి?
నారా లోకేష్ కొంతకాలంగా ఓ ఎర్ర అట్ట ఉన్న పుస్తకాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ప్రచారాలకు ప్రసంగాలకు వెళ్లినప్పుడు ఈ రెడ్ బుక్ పట్టుకుని వెళ్తున్నారు. తెలుగు దేశం పార్టీ నేతలపై కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్న నేతలు, వారికి సపోర్ట్ చేస్తున్న అధికారులు, పోలీసుల పేర్లు ఆ రెడ్ బుక్‌లో నమోదు చేస్తున్నారు. ఆ బుక్‌లో చాలా పెద్ద లిస్ట్ ఉందని.. తాము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి పని చెప్తానని బెదిరించారు.
సీఐడీ నోటీసులు ఎందుకు ఇచ్చిందంటే..
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసులో ఏపీ CID నారా లోకేష్‌ను ఏ14గా పేర్కొంది. అయితే ఆయన ముందస్తు బెయిల్‌కు మంజూరు చేసుకున్న నేపథ్యంలో ఎన్నికలు వస్తున్నాయని ఎక్కడా కూడా కేసులకు సంబంధించిన అంశాలు మాట్లాడకూడదని ఏపీ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ లోకేష్ ఆ రూల్స్ మరిచి ఎక్కడ పడితే అక్కడ కేసుకు సంబంధించిన అంశాలు మాట్లాడటమే కాకుండా పరోక్షంగా బెదిరింపులకు పాల్పడుతున్నారట. ఈ విషయాన్ని ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు ప్రస్తావించగా నోటీసులు పంపేందుకు కోర్టు ఆదేశించింది. సీఐడీ నోటీసులు పంపిన నేపథ్యంలో అధికారులు చేసే విచారణను బట్టి లోకేష్ అరెస్ట్ అవుతారా లేదా అని తెలుస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన బెదిరింపులకు పాల్పడుతుండడంతో లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా అదుపులోకి తీసుకోవాలని ఏపీ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసినా చేయొచ్చు.
Also Read: