ఓ ఏడాదికి సరిపడ కాల్షీట్లు ఇప్పటికే ఎడ్జెస్ట్ చేసిన రష్మిక, ఇప్పుడు వచ్చే ఏడాది సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఈ ఏడాది పుష్ప-2, రెయిన్ బో, యానిమల్ లాంటి సినిమాలకు కాల్షీట్లు ఇచ్చిన ఈ బ్యూటీ, వచ్చే ఏడాది మరిన్ని కొత్త సినిమాలకు కాల్షీట్లు ఇస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ నేషనల్ క్రష్, మరో ఫిమేల్ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఆమె తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం 'రెయిన్‌బో' చేస్తోంది. ఇది కూడా ఫిమేల్ ఓరియంటెండ్ మూవీనే. ఇప్పుడు దీనికి అదనంగా మరో లేడీ సెంట్రిక్ మూవీకి ఆమె ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో కొత్త సినిమాని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దగ్గర చాన్నాళ్లుగా ఓ ఫిమేల్ ఓరియంటెడ్ కథ సిద్ధంగా ఉంది. ఆ కథపై దాదాపు ఏడాదిగా వర్క్ చేశాడు రాహుల్ రవీంద్రన్. నిజానికి ఈ సినిమాను సమంత లీడ్ రోల్ గా చేయాలనేది అతడి ఆలోచన. రాహుల్-సమంత-చిన్మయి బెస్ట్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. ఆ చనువుతో సమంతకు కథ కూడా వినిపించాడు ఈ దర్శకుడు.
అయితే ఇప్పుడు ప్లాన్స్ మారిపోయాయి. సమంత స్థానంలో కాజల్ వచ్చిచేరింది. దీనికి కారణం అందరికీ తెలిసిందే. సమంత ప్రస్తుతం అమెరికాలో ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. ఆమె మళ్లీ ఎప్పుడు సినిమాల్లోకి వస్తుందో చెప్పలేం. ఈలోగా రష్మికకు కథ చెప్పడం, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. గతంలో చిలసా, మన్మధుడు-2 లాంటి సినిమాలు డైరక్ట్ చేశాడు రాహుల్ రవీంద్రన్.
గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది. త్వరలోనే ఈ మూవీని అధికారికంగా ప్రకటించి లాంచ్ చేస్తారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే దసరాకు ఈ సినిమా లాంఛ్ అవుతుంది. రీసెంట్ గా రవితేజ-గోపీచంద్ మలినేని సినిమాకు కాల్షీట్లు కేటాయించింది రష్మిక. ఇప్పుడు రాహుల్ రవీంద్రన్ సినిమాకు డేట్స్ ఇచ్చింది. వీటితో పాటు వచ్చే ఏడాది తమిళ్ లో ఒక సినిమా, హిందీలో మరో సినిమా చేయబోతోంది ఈ బ్యూటీ.