Anchor Sreemukhi: బుల్లితెర స్టార్ యాంకర్, నటి శ్రీముఖి తన కెరీర్ అండ్ పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బొద్దుగుమ్మ రీసెంట్ గా నెట్టింట చిట్ చాట్ నిర్వహించి తన ఫాలోవర్స్, ఫ్యాన్స్ ను తనదైన స్టైల్ లో అలరించింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చేసింది. ప్రేమ, పెళ్లి, అప్ కమింగ్ సినిమాలపై కూడా అప్ డేట్స్ ఇచ్చింది.
Also read :Telangana Elections 2023:ఓటర్ కార్డు లేకపోయినా ఓటేయొచ్చు..ఎలాగో తెలుసా?
ప్రస్తుతం టీవీ, ఓటీటీ షోలతో ఫుల్ బిజీగా ఉన్న నటి.. బిజీ షెడ్యూల్స్‌లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ ద్వారా మంగళవారం అభిమానులతో సరదాగా ముచ్చటించింది. తన లవ్ స్టోరీతో పాటు పెళ్లి గురించి ఓపెన్ అయింది. ఈ మేరకు 'మీరు లవ్‌లో ఎప్పుడైనా ఫెయిల్ అయ్యారా? అని ఓ అభిమాని శ్రీముఖిని అడిగాడు. అతడి ప్రశ్నకు తనదైన శైలిలో 'బొచ్చెడు సార్లు' అంటూ టక్కున సమాధానం ఇచ్చింది. పెళ్లి అయితే యాంకరింగ్ మానేస్తారా అని అడగగా.. 'పెళ్లి అయినా యాంకరింగ్ మానేసేది లేదు' అని క్లారిటీ ఇచ్చింది.
ఇక త్వరలోనే తాను తప్పకుండా పెళ్లి చేసుకుంటానని, కానీ ఎవరిని, ఎప్పుడన్నది మాత్రం క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్‌లో పెట్టింది. 'ఎంతో కొంత నా గురించి చెప్పుకొని మీకు దగ్గర కావాలనే బ్రాడ్కాస్ట్ ఛానెల్లో పెట్టాను' అని ఓ ఫ్యాన్ ప్రశ్నకు సమాధానం చెప్పింది. ఒకవేళ ఎవరైనా బాధలో ఉన్నా కాసేపు వాళ్లను డైవర్ట్ చేసి నేను డైవర్ట్ అవుదామన్నదే బ్రాడ్కాస్ట్ ఛానెల్ పెట్టడానికి కారణమని తెలిపింది. ప్రస్తుతం ఆదివారం విత్ స్టార్ మా పరివారం, డ్యాన్స్ ఐకాన్, సారంగదరియాతో పాటు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోన్న కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ సీజన్ 2కు శ్రీముఖి (Sreemukhi) యాంకర్‌గా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘భోళా శంకర్’ (Bhola Shankar) సినిమాలో నటించిన ఈ అమ్మడు నడము సీన్ తో కుర్రాళ్ల మనసు దోచేసింది.