సైబర్‌ క్రైమ్ పోలీసులకు అనంత శ్రీరామ్‌ ఫిర్యాదు

తనపై కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ సినీ పాటల రచయిత అనంత శ్రీరామ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీని వెనుక ఉన్న వారిని ఎలాగైనా పట్టుకుని శిక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

New Update
సైబర్‌ క్రైమ్ పోలీసులకు అనంత శ్రీరామ్‌ ఫిర్యాదు

కొంత కాలం క్రితం దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని విమర్శిస్తూ కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే ఆ పోస్టుల వెనుక గేయ రచయిత అనంత శ్రీరామ్‌ ఉన్నారంటూ కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అసలేం జరిగిందంటే..కొంత కాలం క్రితం..పొలిటికల్ మిస్సైల్ అనే ఖాతాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విమర్శిస్తూ కొన్ని పోస్టులు దర్శనమిచ్చాయి. ఆ పోస్టుల్లోని రాతలు రాసింది అనంత శ్రీరామ్‌ అంటూ అప్పట్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రచారం చేశారు.

అయితే ఈ విషయం గురించి తెలిసిన అనంత శ్రీరామ్‌ అప్పట్లోనే ఆ వార్తలను ఖండించారు. వాటికి తనకి ఎలాంటి సంబంధం లేదని, ప్రస్తుతానికి నేను అమెరికాలో ఉన్నానని ఇండియాకి వచ్చిన వెంటనే ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆయన ఆనాడే పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఆయన హైదరాబాద్ కి చేరుకున్నారు. వెంటనే ఆయన సైబర్‌ క్రైమ్‌ పోలీసులును కలిసి విషయం అంతా వివరించారు. దీని గురించి ఆయన వారికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ పని వెనుక ఉన్న వారిని ఎలాగైనా పట్టుకుని శిక్షించాలని ఆయన పోలీసులను కోరారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. "నేను వైసీపీ శ్రేణులకు కొన్నిరోజుల క్రితం చెప్పిన విధంగానే సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారానికి కారకులైన వారిపై సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ కు ఫిర్యాదు చేశాను. మాదాపూర్ జోన్ డీసీపీ సందీప్ గారికి నా ఫిర్యాదు పత్రాన్ని అందించాను" అంటూ అనంత శ్రీరామ్ తెలిపాడు. ఈ మేరకు డీసీపీని కలిసినప్పటి ఫొటోను కూడా పంచుకున్నాడు.

Advertisment
తాజా కథనాలు