Anantapur Road Accident : చివరి శ్వాసలోనూ చేయి వదలని బంధం!

తాను విధులకు వెళ్తూ..భార్యను కూడా విధులకు పంపించాలనుకున్న ఆయన మీద ఆ వీధి చిన్న చూపు చూసింది. కొద్ది సేపట్లో చనిపోతానని తెలిసినప్పటికీ కుటుంబం గురించి పిల్లల గురించి ఆలోచించి ధైర్యంగా ఉండాలని భార్యకు చెప్పిన తీరు అక్కడ ఉన్న వారికి కంట తడి పెట్టించింది.

New Update
Anantapur Road Accident : చివరి శ్వాసలోనూ చేయి వదలని బంధం!

Anantapur Road Accident: తాను విధులకు వెళ్తూ..భార్యను కూడా విధులకు పంపించాలనుకున్న ఆయన మీద ఆ వీధి చిన్న చూపు చూసింది. కొద్ది సేపట్లో చనిపోతానని తెలిసినప్పటికీ కుటుంబం గురించి పిల్లల గురించి ఆలోచించి ధైర్యంగా ఉండాలని భార్యకు చెప్పిన తీరు అక్కడ ఉన్న వారికి కంట తడి పెట్టించింది.

ఈ హృదయవిధారక ఘటన అనంతపురంలో జరిగింది. అనంతపురం తపోవనం సర్కిల్‌ లో జరిగిన రోడ్డు ప్రమాదం త్వరాత తీవ్ర గాయాలతో ఉన్న దంపతులిద్దరూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్న దృశ్యాలు అందరికి కంటతడి పెట్టించింది. వివరాల ప్రకారం..ఏ ఆర్‌ కానిస్టేబుల్ గా పని చేస్తున్న కిరణ్‌ తన భార్య అనిత ను బస్టాండ్‌ వద్ద దించేందుకు తీసుకుని వెళ్తుండగా తపోవనం సర్కిల్‌ వద్ద బండి జారిపోయి కిందపడిపోయారు.

పైకి లేచేలోపే వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఇద్దరిని బలంగా ఢీకొట్టింది. దీంతో కిరణ్‌ రెండు కాళ్లు పూర్తిగా ఛిద్రమైపోయాయి. తన ప్రాణాలు మరికాసేపట్లో పోతున్నాయని తెలిసినప్పటికీ ఆ బాధను అంతటిని కంటి బిగువున భరిస్తూ..పక్కన స్పృహ లేకుండా పడి ఉన్న భార్య వద్దకు పాకుతూ వెళ్లి తట్టి లేపాడు.

పిల్లలు జాగ్రత్త..అనిత!

నిస్తేజంగా పడి ఉన్న భార్యను చూస్తు గుండెలు విలసేలా రోదిస్తూ పిల్లల బాధ్యతను ఆమెకు అప్పగించాడు. ఆమెను గట్టిగా హత్తుకుని ఆమెలో ధైర్యాన్ని నూరిపోస్తూ మాటలు చెప్పాడు. ఈ ప్రమాదంలో అనితకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు అంబులెన్స్‌ కు సమాచారం అందించనప్పటికీ అక్కడికి చేరుకోవడానికి సుమారు 20 నిమిషాల సమయం పట్టింది. చికిత్స పొందుతూ కిరణ్‌ మృతి చెందగా, భార్య అనిత చికిత్స పొందుతున్నారు.

మంట గలసిన మానవత్వం!

ఈ ఘటన వల్ల మనుషుల్లో మానవత్వం నశించిపోయింది అని చెప్పడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. ప్రమాదం జరిగి దంపతులిద్దరూ రోడ్డు మీద పడి ఉంటే వారి వద్దకు ఎవరూ వెళ్లలేదు. కనీసం వారికి తాగడానికి కొంచెం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు సరికదా సెల్‌ ఫోన్లు తీసి చిత్రీకరిస్తున్నారు.

ఫోటోలు వీడియోలు తీసారే తప్ప ఒక్కరు కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదు. అంబులెన్సుకు ఫోన్ చేసి అక్కడే చూస్తూ నిలబడి ఉండిపోయారు. అంబులెన్స్ సిబ్బంది వచ్చే వరకు వారికి కనీస సపర్యలు చేయకపోవడం మరీ దారుణం.

కిరణ్‌ స్వస్థలం ఆత్మకూరు. ఆయన ఏపీఎస్సీ కానిస్టేబుల్‌ గా ఎంపికై గ్రే హౌండ్స్ లో పని చేశారు. 2014 నుంచి జిల్లా కేంద్రంలోనే విధులు నిర్వహిస్తున్నారు. భార్య అనిత శింగనమల మండలం తరిమెల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంటుగా పని చేస్తున్నారు. వారికి యశ్వంత్ నారాయణ, మణిదీప్ కుమారులు ఉన్నారు.

ఇటీవలే నగరంలోని కల్యాణదుర్గం రోడ్డులో ఉన్న ఎస్బీఐ కాలనీలో సొంత ఇళ్లు కట్టుకొని ఉంటున్నారు. కిరణ్ కుమార్ రోజూ భార్యను తన బండి మీద సోమలదొడ్డి క్రాస్ రోడ్డు వద్దకు తీసుకెళ్లి బస్సు ఎక్కించి వచ్చేవారు. ఈక్రమంలోనే బైక్ స్కిడ్ అయి ప్రమాదం జరిగింది.

Advertisment
తాజా కథనాలు