Anant Ambani Pre Wedding : ఆ మధ్య ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) 'మన్ కీ బాత్'(Mann Ki Baat) 107వ ఎపిసోడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) మాట్లాడుతూ- 'ఈ రోజుల్లో కొన్ని కుటుంబాలు విదేశాల్లో పెళ్లి చేసుకుంటున్నాయి. ఇది అవసరమా? భారత గడ్డపై భారతీయుల మధ్య వివాహాలు జరుపుకుంటే దేశ సొమ్ము దేశంలోనే ఉంటుంది. దీనివల్ల చిన్నవారికి కూడా ఉపాధి దొరుకుతుంది.’ అని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అదిగో దానిని స్ఫూర్తిగా తీసుకున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మరియు MD ముఖేష్ అంబానీ(Mukesh Ambani). ఆయన తన చిన్న కుమారుడు అనంత్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ మన దేశంలోనే నిర్వహిస్తున్నారు. గుజరాత్ లోని జామ్ నగర్ లో మార్చి 1 నుంచి 3 వరకూ అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుగుతాయి. ఇందుకోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. మూడురోజులకు సంబంధించి ఈవెంట్స్ వివరాలతో ఇన్విటేషన్స్ కూడా ఇప్పటికే అతిథులకు చేరిపోయాయి. ప్రపంచంలోనే 10వ అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి. దానికి సంబంధించిన ముందస్తు వేడుకలు.. మరి సహజంగానే అపర కుబేరులు.. వ్యాపార దిగ్గజాలు తరలి వస్తారు కదా. ఇదిగో ప్రీ వెడ్డింగ్ వేడుకలకు వస్తారని భావిస్తున్న అతిథుల లిస్ట్..
మార్క్ జుకర్‌బర్గ్ నుండి ఇవాంక ట్రంప్ వరకు..
ఈ ఫంక్షన్(Anant Ambani Pre Wedding) కు వచ్చే అతిథుల లిస్ట్ లో మెటా సిఇఒ మార్క్ జుకర్‌బర్గ్, మోర్గాన్ స్టాన్లీ సిఇఒ టెడ్ పిక్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, డిస్నీ సిఇఒ బాబ్ ఇగర్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, బ్లాక్‌రాక్ సిఇఒ లారీ ఫింక్, అడ్నాక్ సిఇఒ సుల్తాన్ అహ్మద్ ఉన్నారు. అల్ జబర్కూడా వచ్చే అవకాశం ఉంది. వీరితో పాటు, EL రోత్స్ చైల్డ్ ఛైర్మన్ లిన్ ఫారెస్టర్ డి రోత్స్ చైల్డ్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, టెక్ ఇన్వెస్టర్ యూరి మిల్నర్, భూటాన్ రాజు-రాణిలకు కూడా అంబానీ కుటుంబం నుంచి ఆహ్వానాయాలు వెళ్లాయి.
ఇక వ్యాపార ప్రముఖులు, రాజకీయ నాయకులతో పాటు క్రీడలు, బాలీవుడ్, సైన్స్, జర్నలిజం, సామాజిక సేవకు సంబంధించిన ప్రముఖులను కూడా ఆహ్వానించారు. జామ్‌నగర్‌లో జరిగే ప్రీ వెడ్డింగ్ వేడుక(Anant Ambani Pre Wedding) లో బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియా భట్ ల ప్రత్యేక ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు.
అతిథులకు సంప్రదాయ కండువాలు..
వివాహానికి(Marriage) ముందు జరిగే కార్యక్రమంలో గుజరాత్‌లోని కచ్ - లాల్‌పూర్‌కు చెందిన మహిళా కళాకారులు తయారు చేసిన సంప్రదాయ కండువాలను అతిథులకు అందజేస్తారు. జాతీయ మీడియా(National Media) లో వస్తున్న వార్తల ప్రకారం వివాహానికి ముందు జరిగే వేడుకకు దాదాపు 1000 మంది అతిథులు హాజరుకానున్నారు.
Also Read : దీన్ని కొట్టే కంపెనీ ఏదైనా ఉందా? ఒక్క షేర్ లక్షన్నర! MRF రికార్డ్!!
9 పేజీల ఇన్విటేషన్..
Anant Ambani Pre Wedding : మూడు రోజుల విలువైన దుస్తుల ఫోటోగ్రాఫ్‌లతో కూడిన వార్డ్‌రోబ్ ప్లానర్‌తో అతిథులకు 9-పేజీల ఇన్విటేషన్ కార్డు పంపించారు. వార్డ్‌రోబ్ ప్లానర్‌లోని మూడు పేజీలు మూడు రోజుల దుస్తుల ఫోటోగ్రాఫ్‌లతో పాటు కార్యక్రమ వివరాలు.. ప్రోగ్రామ్ థీమ్‌ను కూడా వీటిలో ఇచ్చారు. అంతేకాదు, దీనితో పాటు, ఈవెంట్స్ రోజుల్లో జామ్‌నగర్‌లో ఉండవచ్చనే ఉష్ణోగ్రతల వివరాలు కూడా పేర్కొన్నారు. అతిథుల కోసం హెయిర్ స్టైలిస్ట్, మేకప్ ఆర్టిస్ట్, డ్రెస్ డిజైనర్లను కూడా ఏర్పాటు చేశారు.
అతిథుల కోసం ఢిల్లీ-ముంబై నుంచి చార్టర్డ్ విమానం ఏర్పాటు..
Anant Ambani Pre Wedding అతిథుల కోసం ప్రత్యేక విమానాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ విమానాలు ఢిల్లీ, ముంబై నుండి జామ్‌నగర్‌కు వస్తాయి. జామ్‌నగర్ నుండి ఈ నగరాలకు తిరిగి వెళ్తాయి. మార్చి 1న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విమానాలు అందుబాటులో ఉంటాయి.
వధువు రాధిక మర్చంట్ వివరాలివే..
రాధిక వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె. వీరేన్ మర్చంట్ గుజరాత్‌లోని కచ్ నివాసి. ఆయన ADF ఫుడ్స్ లిమిటెడ్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అలాగే 'ఎన్‌కోర్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్' CEO, వైస్ ఛైర్మన్ గా ఉన్నారు. రాధిక న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో పాలిటిక్స్, ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆమె ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ ఎన్‌కోర్ హెల్త్‌కేర్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమెకు ట్రెక్కింగ్ - స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. ఆమె ముంబైలోని శ్రీ నిభా ఆర్ట్ డ్యాన్స్ అకాడమీకి చెందిన గురు భవన్ థాకర్ ఆధ్వర్యంలో రాధిక క్లాసికల్ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంది.