Anant Ambani Gifted Costly Watches: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. జులై 12న అనంత్ తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. అనంత్ రాధికా వివాహానికి ప్రపంచ నలుమూలల నుంచి , ప్రముఖులు, వ్యాపార వేత్తలు, దేశాధినేతలు, సినీ తారలు హాజరయ్యారు. పెళ్లి వేడుకల్లో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినీ తారలు, స్టార్ క్రికెటర్లు సందడి చేశారు.
ఈ పెళ్లి కోసం దాదాపు రూ.5000 కోట్ల మేరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ పెళ్లి వేడుకలో భాగంగా అనంత్ అంబానీ పలువురు బాలీవుడ్ స్టార్స్ కు ఖరీదైన వాచ్ లు గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తుంది. అనంత్ అంబానీకి బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, రన్ వీర్ సింగ్, షారుక్ ఖాన్, రణ్ బీర్ కపూర్ లాంటి స్టార్ హీరోలతో మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఈ క్రమంలోనే తన పెళ్లి సందర్భంగా అనంత్ అంబానీ ఈ హీరోలందరికీ ఖరీదైన వాచ్ లు గిఫ్ట్ గా ఇచ్చాడు.
Also Read : అంబానీ పెళ్ళిలో సినీ తారల డాన్సులు.. సందడే సందడి..! వీడియో వైరల్
ఒక్కో వాచ్ ధర అన్ని కోట్లా?
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.'అడెమార్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ పెర్పుట్యల్ కాలండెర్' అనే కంపెనీకి చెందిన ఈ వాచ్ ధర రూ.2 కోట్ల పైమాటే అని తెలుస్తోంది. ఇది తెలిసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. కాగా ఈ కాస్ట్లీ వాచ్ లతో షారుక్, రణ్‍వీర్ పోజులిచ్చిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.