దేశ ఆర్థిక రాజధాని ముంబైలో డబ్బావాలాలు ఎంత ఫేమస్ అనే విషయం అందరికీ తెలిసిందే. వారిని ఆదర్శంగా తీసుకుని అనేక రాష్ట్రాల్లో ఈ డబ్బావాలా విధానాన్ని మొదలు పెట్టారు కూడా. ఇంటి నుంచి భోజన డబ్బాలను తీసుకుని ఆఫీసుల్లో పని చేసే వారికి డబ్బాలను డెలివరీ చేయడం ఈ డబ్బావాలాలు చేసే పని.
ముంబైలో మొదలైన ఫుడ్ డెలివరీ చేసే డబ్బావాలా విధానం ఇప్పుడు పరాయి దేశానికి కూడా వెళ్లింది. లండన్‌లోని ఓ స్టార్టప్ ఈ విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుంది. అక్కడి వారికి స్టీల్ డబ్బాల్లో ఫుడ్ డెలివరీ చేస్తోంది. పన్నీర్ సబ్జీ, మిక్స్‌డ్ వెజిటబుల్ రైస్ వంటి భారతీయ వంటకాలను రుచి చూపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు.
రివర్స్ కాలనైజేషన్ అవుతుందని చెప్పడానికి ఇంతకంటే బెటర్ ఎవిడెన్స్ లేదని పేర్కొన్నారు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.