Murdered By Family Members : ఎలమంచిలికి చెందిన రామాంజనేయులు మిస్పింగ్ కేసు (Ramanjaneyulu Missing Case) ను పోలీసులు ఛేదించారు. ఆస్తి తగాదాలతో కుటుంబ సభ్యులే రామాంజనేయులను హతమార్చినట్లు (Murder) విచారణలో తేలినట్లు వెల్లడించారు. ఈ మేరకు మే 23న మాడుగుల పోలీస్ స్టేషన్లో సేనాపతి శ్రీదేవి తన భర్త రామాంజనేయులు(31) 21వ తేదీ నుంచి కనిపించుట లేదని ఇచ్చిన కంప్లైంట్ పై మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా వెతుకుతున్న క్రమంలో ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మృతదేహం కొక్కిరాపల్లి దగ్గర ఉన్న చెరువులో గుర్తించడం జరిగింది. శ్రీదేవి చనిపోయిన వ్యక్తి తన భర్త అని ధృవీకరించగా, వైద్యాధికారి ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం కేసును హత్య కేసుగా నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి, జిల్లా ఎస్పీ మురళీకృష్ణ ఐదు టీమ్స్ ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు కోసం ఆదేశించినట్లు తెలిపారు.
రెస్టారెంట్ సరిగా నడపలేక..
ఈ మేరకు దర్యాప్తు చేస్తున్న క్రమంలో 28-5-2024 న మృతుడి తండ్రి సేనాపతి నాగరాజు(A2) అతని తమ్ముడు సేనాపతి శివాజీ(A1), శీలంనేని గోపి సతీష్(A3)లు వీఆర్వో సమక్షంలో మాడుగుల పోలీస్ స్టేషన్లో దర్యాప్తు అధికారి ముందు లొంగిపోయి నేరం ఒప్పు్కున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లిదండ్రులు నాగరాజు (ఏ2) లక్ష్మి (తల్లి), సోదరుడు శివాజీ (ఏ1) మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయన్నారు. మరణించిన సేనాపతి రామాంజనేయులకు తండ్రి రూ.6 లక్షల నగదు ఇవ్వగా ఎం.కోటపాడులో రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ మృతుడు రెస్టారెంట్ ను సరిగా నడపలేక మరింత డబ్బులు ఇవ్వాలని ఆస్తులు పంచాలని తల్లిదండ్రులను సోదరుడిని కొట్టేవాడు. దారుణమైన హింస కారణంగా తండ్రి, సోదరుడు మరణించిన సేనాపతి రామాంజనేయులు ప్రవర్తనతో విసిగిపోయి అతనిని చంపడానికి పథకం వేశారు.
Also Read : ఎన్నికల ముందు ఒడిశాలో ఈసీ సంచలన నిర్ణయం
రూ.8 లక్షల అగ్రిమెంట్..
ఇదే క్రమంలో ఏ1 తన స్నేహితుడు, సహోద్యోగి అయిన ఏ3ని సంప్రదించి, మృతుడిని చంపడానికి డబ్బు ఇచ్చారు. ఆ తర్వాత ఏ3, ఏ4 నుండి ఏ7 వరకు హత్య చేయడానికి ఏర్పాటుచేసి, రూ.8 లక్షలు ఇచ్చేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. వారి ప్రణాళికలో భాగంగా 20.05.2024న ఏ1, ఏ3 నుండి ఏ7 వరకు నిందితులను ఎం.కోటపాడు తీసుకుని వచ్చి మరణించిన వాని రెస్టారెంట్, ఇల్లు చూపించారు. ఏ4 నుండి ఏ7 నిందితులు మృతిని కదలికలను గమనించి తేదీ.21.05.2024 మధ్యాహ్నం 2 గంటలకు ఏ3 నుండి ఏ7 వరకు నిందితులు మృతుని రెస్టారెంట్ కి వెళ్లి అతనితో మద్యం తాగించి, వడ్డాది వద్ద దింపుతామంటూ కారులో తీసుకుని వెళ్లి మార్గమధ్యంలో కడుపులో కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఎలమంచిలి మండలం, కొక్కిరపల్లి వద్ద ట్యాంకులో పడేసి పరారయ్యారు. ఇందుకుగాను మృతుని సోదరుడు అయినా ఏ1 నిందితులకు రూ. 6 లక్షల ఇచ్చాడు. దర్యాప్తు అధికారి, హత్య చేయుటకు గల కారణాలు, చేసిన విధానం తెలుసుకొని ఈ హత్య లో పాల్గొన్న మిగిలిన నలుగురు ముద్దాయిలను కూడా ఈరోజు అనగా 28-5-2024న చోడవరం టౌన్ బస్టాండ్ వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మొత్తం ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్ కి పంపించడం జరిగిందని వివరించారు.