Janasena : అనకాపల్లిలో జనసైనికుల వినూత్న ప్రచారం..! అనకాపల్లి నియోజకవర్గంలో జనసైనికులు వినూత్న ప్రచారానికి తెరలేపారు. ఎమ్మెల్యే అభ్యర్థి కొణతల రామకృష్ణను గెలిపించాలని టీ తాగండి..గాజు గ్లాస్ కి ఓటెయ్యండి అంటూ ప్రచారం చేపట్టారు. స్థానిక నెహ్రూ చౌక్ జంక్షన్ లో ప్రజలకు టీ అందిస్తూ గాజు గ్లాస్ విశిష్టతను వివరిస్తున్నారు. By Jyoshna Sappogula 16 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Janasena : ఏపీ(AP) లో ఎన్నికల హాడావిడి మాములుగా లేదు. గెలుపు మాదంటే మాదంటూ పోటా పోటీ ప్రచారాలు చేపట్టారు. ఒకవైపు అధికార పార్టీ వైసీపీ..మరోవైపు ప్రతిపక్ష పార్టీలు. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన(Janasena), బీజేపీ పొత్తులు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే(YCP MLA) అభ్యర్థులను ప్రకటించింది. టికెట్ దక్కిన నేతలు ఫుల్ జోష్ తో ప్రచారం రంగంలోకి దూకారు. టీడీపీ(TDP) జనసేన బీజేపీ(BJP) మాత్రం రిసెంట్ గానే ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రకటించింది. Also Read : విడాకులకు సిద్దమైన రాజ్.. బెడిసికొట్టిన ఇందిరాదేవి ప్లాన్.. ముక్కలైన కావ్య జీవితం..! అయితే, ఉమ్మడి కూటమిలో భాగంగా టికెట్ ఆశించిన నేతలు సీటు దక్కకపోవడంతో తీవ్ర స్థాయిలో ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అటు వైసీపీ(YCP) లో, ఇటు టీడీపీ, జనసేన లో టికెట్ దక్కని ఆశావహులు రాజీనామాలు చేశారు. ఆనంతరం నచ్చిన పార్టీకి వెళ్తున్నారు. మరికొందరూ మాత్రం ఇక చేసేదేమి లేక సైలెంట్ గా పార్టీలోనే ఉంటూ ఎమ్మెల్యే అభ్యర్ధులకు సహాయపడుతున్నారు. Also Read : క్లీంకారతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ఉపాసన తాజాగా, అనకాపల్లి జిల్లా(Anakapalle District) లో జనసైనికులు వినూత్న ప్రచారానికి తెరలేపారు. ఉమ్మడి కూటమిలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలో జనసేనకు టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొణతాల రామకృష్ణను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో, గాజు గ్లాస్ గుర్తును విస్తృతంగా ప్రచారం చేపట్టారు. అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్ లో ప్రజలకు టీ అందిస్తూ గాజు గ్లాస్ కి ఓటేయాలని అభ్యర్థించారు. ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే విధంగా గాజు గ్లాస్ విశిష్టతను వివరిస్తున్నారు. గాజు గ్లాస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతోనే ఈ వినూత్న ప్రచారానికి తెరలేపామని జనసైనికులు వివరించారు. దీనిని ఆదర్శంగా తీసుకొని జనసేనకు కేటాయించిన నియోజకవర్గాల్లో పార్టీ నేతలు గాజు గ్లాస్ గుర్తు ప్రజలకు గుర్తుండే విధంగా ప్రచారం చేయాలని కోరారు. #andhra-pradesh #janasena #anakapalli-district మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి