Horror : 13 ఏళ్ల బాలికను వివస్త్రను చేసి చిత్రహింసలు పెట్టి.. కుక్కతో కరిపించారు..!

హర్యానా-గురుగ్రామ్‌లో అమానవీయ ఘటన జరిగింది. పనిమనిషిగా ఉన్న 13ఏళ్ల బాలిక నోటికి టేప్‌ వేసి రాడ్డుతో కొట్టారు. వివస్త్రను చేసి వీడియో రికార్డు చేశారు..కుక్కతో కరిపించి పైశాచిక ఆనందం పొందారు.

Horror : 13 ఏళ్ల బాలికను వివస్త్రను చేసి చిత్రహింసలు పెట్టి.. కుక్కతో కరిపించారు..!
New Update

పనిమనుషులను ఇంట్లో వారిగా చూసుకునే యజమానులు ఉంటారు.. అదే సమయంలో పని మనుషులను ఆట వస్తువుగా.. గొడ్డు చాకిరి చేసే వారిగా చూసే నీచులూ ఉంటారు. ఇంట్లోనే ఉండొచ్చని.. నెలకు చిల్లర డబ్బులు ముఖనా పడేసి వెట్టిచాకిరి చేయించుకోని.. చేతికి దూల ఎక్కినప్పుడల్లా కొట్టి.. ఇష్టానుసారంగా ప్రవర్తించే సైకో యజమానుల గురించి అప్పుడప్పుడు వింటూనే ఉంటాయి. అరబ్‌ దేశాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతాయి. ఇటు ఇండియాలోనూ కొన్ని చోట్లా ఇలాంటి ఘటనలు బయటకొస్తుంటాయి. హర్యానా-గురుగ్రామ్‌(Gurugram)లో జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకుంటే సమాజం ఎటుపోతుందో అనిపించకమానదు.

ఏం జరిగిందంటే?
బీహార్‌కు చెందిన ఓ తల్లి గత జూన్ 27న సమీపంలోని ప్రాంతంలో వాహనాలను శుభ్రపరిచే వ్యక్తి సహాయంతో తన కుమార్తె(13)కు ఉద్యోగం ఇప్పించింది. గురుగ్రామ్‌లోని ఓ ఇంట్లో పని చేయాలి. అక్కడే ఉండాలి. బాలికకు వసతి ,నెలవారీ జీతం రూ. 9,000 ఇస్తానని హామీ ఇచ్చారు. మొదటి రెండు నెలలు మాత్రమే జీతం ఆ తల్లికి జీతం అందింది. ఇక తన కుమార్తే దగ్గర నుంచి ఎలాంటి ఫోన్‌ కాల్స్ రావడంలేదు. జీతం కూడా అందడంలేదు. దీంతో యజమాని ఇంటికి వెళ్లింది తల్లి. అయితే ఎన్ని సార్లు వెళ్లినా ఒక్కసారి కూడా తన కూతురిని కలవలనివ్వలేదు. ఫోన్‌లో మాట్లాడనివ్వడంలేదు. అనుమానం వచ్చిన తల్లి సెక్టార్ 51 మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు యజమాని ఇంట్లో బందీగా ఉన్న బాలికను విడిపించారు.

ఇంత క్రూరమా?
ఓ గదిలో తాళం వేసి బాలిక బాలికను లాక్‌ చేశారు. బయటకు అరవకుండా నోటికి టేప్‌ కూడా వేశారు. బాలికకు 48 గంటలకొకసారి మాత్రమే ఆహారం ఇచ్చేవారు. బాలికను కొట్టడం కుక్కతో కరిపించడం చేసేవాళ్లు. ఇదంతా ఆ ఇంట్లోని యజమానురాలు చేసేది. అటు ఆమెకు ఇద్దరు కొడుకులు. వారిద్దరూ మరింత శాడిజం చూపించారు. బాలికను వివస్త్రను చేసి ఫొటోలు తీసేవారు. తాకకూడని చోట తాకేవారు. ఇనుప రాడ్‌, సుత్తితో సైకోల్లాగా దాడి చేసేవారు. ఇదంతా వీడియో రికార్డు చేసి పైశాచిక ఆనందం పొందేవారు. ఇక నిందితులపై పోక్సో చట్టంలోని సెక్షన్ 10తో పాటు జువైనల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 75 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: చేతి కర్రతో న్యాయాన్ని గెలిపించాడు.. రెండు రోజులకే తుది శ్వాస విడిచిన సౌమ్య తండ్రి

WATCH:

#crime-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe