Iran-Israel war: ఇజ్రాయెల్‌ నుంచి RTV ఎక్స్‌క్లూజివ్‌ రిపోర్టు!

ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి తెలుగు వ్యక్తి Rtvకి ఎక్స్‌క్లూజివ్‌ రిపోర్టు అందించారు. ఇజ్రాయెల్ లో 10వేల మంది తెలుగువారు ఉన్నట్లు తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.

Iran-Israel war: ఇజ్రాయెల్‌ నుంచి RTV ఎక్స్‌క్లూజివ్‌ రిపోర్టు!
New Update

Iran-Israel war: ఇరాన్‌ Vs ఇజ్రాయెల్‌ మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్‌పై ప్రతీకారదాడితో రగిలిపోతున్న ఇజ్రాయెల్‌.. ఇరాన్‌ న్యూక్లియర్‌ ప్లాంట్లపై దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా ఇరాన్ అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుందనే వార్తలతో స్థానిక ప్రజలు టెన్షన్ పడుతున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఏం జరగబోతుందనే విషయంపై తెలుగు వ్యక్తి  ఇజ్రాయెల్ నుంచి Rtvకి ప్రత్యక్షంగా వివరించారు.

IAEA చీఫ్‌ రాఫెల్‌ గ్రాసీ ఆందోళన..
ఈ మేరకు ఇరాన్‌లోని అణు కేంద్రాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్‌ దాడులు చేయొచ్చని ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ IAEA చీఫ్‌ రాఫెల్‌ గ్రాసీ ఆందోళన వ్యక్తం చేయడం మరింత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిందని తెలిపారు. ఈ క్రమంలోనే భద్రతా కారణాలతో తన అణుకేంద్రాలను ఇరాన్‌ మూసివేసి.. న్యూక్లియర్ ప్లాంట్ల దగ్గర తనిఖీలు చేయడంతోపాటు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ ఇజ్రాయిల్‌లో ఇంకా భయంభయంగానే ఉందని, ప్రస్తుతానికి బాంబు దాడులు ఆగినా ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన చెందుతున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Swastika Mukherjee: లేటు వయసులో ఘాటు సీన్స్.. ముఖర్జీ శృంగార సన్నీవేశం లీక్.. వీడియో వైరల్!

వేల మంది తెలుగు ప్రజలు..
ముఖ్యంగా ఇజ్రాయిల్‌లో పది వేల మంది తెలుగు ప్రజలు ఉన్నట్లు చెప్పారు. మిస్సైల్స్‌ పడినప్పుడు రక్షణ కోసం ప్రతి బిల్డింగ్‌లోనూ గ్రౌండ్‌ ఫ్లోర్‌ కింద బంకర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఐరన్‌ డోర్లతో బంకర్లలో గదులున్నాయని, ఒక్కో గదిలో ముగ్గురు, నలుగురు ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు చూపించారు. బాంబులు పడినా ధ్వంసం కాకుండా పటిష్ట నిర్మాణం చేశారని, రోజుల తరబడి బంకర్లలోనే ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. గదిలో ఏసీ సదుపాయం కూడా ఉందని, ప్రస్తుతానికైతే రోజువారి జీవితం సాధారణంగానే కొనసాగుతున్నట్లు తెలిపారు.

#iran-israel-war #exclusive-report-to-rtv
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe