Bangalore: థ్రిల్ కోసం డ్రగ్స్ తీసుకున్న యువతి.. చివరికి ఏమైందో తెలిస్తే షాక్!

స్నేహితుడి సలహాతో థ్రిల్ కోసం డ్రగ్స్ తీసుకున్న ఓ 18ఏళ్ల యువతి చనిపోయింది. డ్రగ్స్‌ ఓవర్‌ డోస్‌ కావడంతో అపస్మారక స్థితిలోకి చేరుకోగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే కన్నుమూసింది. ఈ భయంకరమైన ఘటన లఖ్‌నవూలోని తివారీగంజ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది.

Drugs In Hyderabad: పాతబస్తీలో భారీగా డ్రగ్స్ పట్టివేత
New Update

DRUGS: స్నేహితుడి మాటలకు లొంగి థ్రిల్ కోసం డ్రగ్స్ తీసుకున్న ఓ 18ఏళ్ల యువతి చనిపోయింది. డ్రగ్స్‌ ఓవర్‌ డోస్‌ కావడంతో అపస్మారక స్థితిలోకి చేరుకోగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే కన్నుమూసింది. ఈ భయంకరమైన ఘటన లఖ్‌నవూలోని తివారీగంజ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది.

డ్రగ్స్‌ తీసుకుంటే థ్రిల్‌ వస్తుందని..
పోలీసుల వివరాల ప్రకారం.. బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేసే ఓ యువతి(18) ఏప్రిల్ 3న లఖ్‌నవూలోని తన ఇంటికి వెళ్లింది. అయితే ఏప్రిల్ 7న ఆమె బెంగళూరుకు తిరుగు ప్రయాణమైన సమయంలో తన స్నేహితుడు వివేక్ మౌర్యను కలిసింది. దీంతో డ్రగ్స్‌ తీసుకుంటే థ్రిల్‌ వస్తుందని వివేక్‌ ఆ యువతికి ఓ సిరంజిని ఇంజెక్ట్‌ చేశాడు. డ్రగ్స్‌ మోతాదు ఎక్కువ కావడంతో కొంతసేపటికి ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో.. యువకుడు తానూ మత్తులో ఉండడంతో పోలీసులకు ఫోన్‌ చేసి సహాయం కోరాడు. వారు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

ఇది కూడా చదవండి: AP: వివేకానంద రెడ్డి హత్య కేసు.. వైఎస్ షర్మిలపై హైకోర్టులో వ్యాజ్యం!!

విషయం తెలియగానే ఆస్పత్రినుంచి పారిపోతున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో లఖ్‌నవూలోని న్యూ హైదరాబాద్ ప్రాంతంలోని వివేక్ ఇంట్లో ఆ యువతి కుటుంబం అద్దెకు ఉండేదని పోలీసులు గుర్తించారు. వివేక్‌ డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడని, ఆమెను కూడా మాదకద్రవ్యాలు తీసుకునేలా ప్రోత్సహించేవాడన్నారు. యువకుడు ఉద్దేశపూర్వకంగా తమ కుమార్తెను హత్య చేసి ఉండవచ్చని యువతి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేశారు.

#bangalore #18-year-old-girl-died-of-a-drug-overdose
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe