Lata Deenanath Mangeshkar : బాలీవుడ్(Bollywood) సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. సినీ ఇండస్ట్రీ(Cine Industry) కి ఆయన చేసిన సేవలకుగానూ ఇప్పటికే పలు పురష్కారాలు, సన్మానాలు లభించగా తాజాగా ప్రముఖ దివంగత గాయని లతా మంగేష్కర్(Lata Mangeshkar) పేరుతో ఏర్పాటు చేసిన 'లతా దీనానాథ్ మంగేష్కర్' పురస్కారాన్ని బిగ్ బీకి అందించబోతున్నట్లు లతా కుటుంబ సభ్యులు తెలిపారు.
లతా దీనానాథ్ మంగేష్కర్..
ఈ మేరకు 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని అందిస్తుండగా 2023లో భారత ప్రధాని మోడీకి మొదటిసారి, తర్వాత ఆశా భోస్లేకు ఇచ్చారు. ఈ క్రమంలోనే అమితాబ్ సేవలను గుర్తించి లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ వర్ధంతి సందర్భంగా ఏప్రిల్ 24న 'లతా దీనానాథ్ మంగేష్కర్' పురస్కారంతో అమితాబ్‌ను సత్కరించనున్నారు. దీనిపై బచ్చన్ కుటుంబ సభ్యులు, ప్రముఖులు, సెలబ్రిటీలు, సంతోషం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: The Wedding Guest: ఓటీటీలో తెలుగు హీరోయిన్ పోర్న్ మూవీ!
ఏఆర్ రెహమాన్ కూడా..
అలాగే భారతీయ సంగీతానికి చేసిన కృషికిగానూ ఏఆర్ రెహమాన్ కూడా ఈ పురస్కారం అందుకోనున్నట్లు వారి కుటుంబం తెలిపింది. సామాజిక సేవా రంగంలో సేవలకు గాను లాభాపేక్షలేని సంస్థ దీప్‌స్తంభ్ ఫౌండేషన్ మనోబల్‌కు కూడా ఈ అవార్డును అందజేయనున్నారు. వీరితో పాటు మరికొంత మంది ప్రముఖులు సైతం ఈ అవార్డుకు ఎంపికయ్యారు.