Amitabh Bachchan : వాళ్ళతో కలిసి 'కల్కి' చూడాలని ఉంది.. అమితాబ్ బచ్చన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

'కల్కి' విజయం సాధించిన నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ దర్శకుడిని ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. ఇందులో అమితాబ్ 'కల్కి పై తెలుగు ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉందో స్వయంగా వాళ్లనే అడిగి తెలుసుకోవాలి.హైదరాబాద్‌లో ఉన్న తెలుగు ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూడాలి' అని అన్నారు.

New Update
Amitabh Bachchan : వాళ్ళతో కలిసి 'కల్కి' చూడాలని ఉంది.. అమితాబ్ బచ్చన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Amitabh Bachchan - Nag Ashwin Latest Interview : నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas), దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషించిన 'కల్కి 2898AD' (Kalki 2898AD) చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.మోడ్రన్ మహాభారతంతో నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన ఈ విజువల్ వండర్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఇప్పటికే రూ.900 కోట్లు కలెక్ట్ చేసి వెయ్యి కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. కాగా సినిమా అనూహ్య విజయం సాధించిన నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ దర్శకుడిని ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. తాజాగా దానికి సంబంధించిన ప్రోమోను నిర్మాణ సంస్థ విడుదల చేసింది.

Also Read : ‘కల్కి’ పార్ట్-2 లో కర్ణుడి సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది : చైల్డ్ ఆర్టిస్ట్ కేయా

తెలుగు ఆడియన్స్ తో కలిసి 'కల్కి' చూడాలి...

" కల్కి లో చేసినందుకు వస్తోన్న ప్రశంసలు నా నటనకు అనుకోవడం లేదు. ఆ పాత్ర, కాన్సెప్ట్‌కు వస్తున్నాయి. ‘కల్కి’లో దీపికా పదుకొణె పాత్ర అద్భుతం. ఈ ఐడియా వచ్చినందుకు మిమ్మల్ని (నాగ్‌ అశ్విన్‌) ప్రశంసించాలి. ఆమె నిప్పుల్లో నడుచుకుంటే వచ్చే సన్నివేశం హైలైట్‌. కానీ అందులో తనకేం కాకుండా చూపించారు. ఈ విషయంపై నేను ప్రేక్షకుల అభిప్రాయాలు తెలుసుకోవాలి. సినిమా ఎలా ఉందని వాళ్లను అడిగి కనుక్కోవాలి. హైదరాబాద్‌లో ఉన్న తెలుగు ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూడాలి. ఎందుకంటే వాళ్లు సినిమాను బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు" అని అన్నారు.

Advertisment
తాజా కథనాలు