Amitabh Bachchan : ప్రభాస్ కు అది కామన్.. కానీ నాకు అలా కాదు : అమితాబ్ బచ్చన్

'కల్కి 2898AD' చిత్రానికి వస్తోన్న విశేష స్పందనపై అమితాబ్‌ బచ్చన్‌ ఆనందం వ్యక్తంచేశారు. ఇలాంటి సక్సెస్‌లు ప్రభాస్‌కు రొటీన్‌గా మారాయని.. ఇటీవల కాలంలో ఆయన నటించిన చాలా చిత్రాలు రూ.1000 కోట్ల క్లబ్‌లోకి వచ్చాయని తెలిపారు.

New Update
Amitabh Bachchan : ప్రభాస్ కు అది కామన్.. కానీ నాకు అలా కాదు : అమితాబ్ బచ్చన్

Amitabh Bachchan About Kalki Movie Success : పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన 'కల్కి 2898AD' మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. జూన్ 27 న రిలీజైన ఈ సినిమా తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది. ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల గ్రాస్‌ వసూలు చేసిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

కాగా సినిమాలో అశ్వద్ధామ పాత్ర పోషించిన బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ పంచవ్యాప్తంగా తమ చిత్రానికి వస్తోన్న విశేష స్పందనపై ఆనందం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా 'కల్కి' ఘన విజయంలో భాగమైన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. అంతేకాకుండా ఇలాంటి సక్సెస్‌లు ప్రభాస్‌కు రొటీన్‌గా మారాయని.. ఇటీవల కాలంలో ఆయన నటించిన చాలా చిత్రాలు రూ.1000 కోట్ల క్లబ్‌లోకి వచ్చాయని తెలిపారు.

Also Read : తలపతి విజయ్ తో రంభ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్, ఈ సడెన్ సర్ప్రైజ్ వెనక కారణం అదేనా?

" నా వరకూ ఇలాంటి గొప్ప చిత్రంలో భాగమైనందుకు ఆనందిస్తున్నా. ఈ చిత్రాన్ని నేను ఎంతగా ఎంజాయ్‌ చేశానో చెప్పడానికి మాటలు చాలడం లేదు. ఇప్పటికే నాలుగుసార్లు సినిమా చూశా. సినిమా చూసిన ప్రతిసారీ ఏదోఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటూనే ఉన్నా" అంటూ పేర్కొన్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమాలో దీపికా పదుకొనె, కమల్ హాసన్, విజయ్ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ కీలక పాత్రల్లో కనిపించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు