Amit Shah: కేంద్రమంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన సోదరి రాజేశ్వరి బెన్ (60) ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో మంత్రి పర్యటనలు రద్దు చేసుకుని ఇంటికి చేరుకున్నారు.

New Update
Amit Shah: కేంద్రమంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. సంక్రాంతి పండుగపూట అమిత్ షా సోదరి మరణించారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న రాజేశ్వరి బెన్ (Rajeshwari Ben).. ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు.

ఆరోగ్యం విషమించి..
60 ఏళ్ల మధ్య వయసున్న రాజేశ్వరికి ఇటీవలే సర్జరీ చేశామని, అయినప్పటికీ ఆమె ఆరోగ్యం విషమించి ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారని వైద్యులు వెల్లడించారు. ఇక ఈ విషయం తెలియగానే పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన హోం మంత్రి హుటాహుటిని తన పర్యనలను రద్దుచేసుని ముంబైకి చేరుకున్నారు. సోమవారం తెల్లవారుజామున అహ్మదాబాద్‌లోని ఆమె నివాసానికి ఆమె భౌతికకాయాన్ని తీసుకొచ్చారు.

ఇది కూడా చదవండి :T20 World Cup: కోహ్లీ ఆడతాడో లేదో తెలియదు? సురేష్ రైనా

పర్యటనలు రద్దు..
అయితే బీజేపీ మద్దతుదారులతో కలిసి మకర సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు షా ఆదివారం నుంచి అహ్మదాబాద్‌లో ఉండగా.. ఈ మరణ వార్తతో గుజరాత్‌లో జరగాల్సిన రెండు బహిరంగ కార్యక్రమాలను షా పాల్గోనడం లేదని అధికారులు తెలిపారు. బనస్కాంత, గాంధీనగర్ జిల్లాల్లో జరిగే రెండు కార్యక్రమాలకు ఆయన హాజరుకావాల్సి ఉంది. బనస్కాంతలో, దేవదర్ గ్రామంలో బనాస్ డెయిరీ వివిధ ప్రాజెక్టులతోపాటు గాంధీనగర్‌లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీలో షా ప్రాజెక్టులను మంత్రి ఆవిష్కరించనున్నప్పటికీ ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి.

Advertisment
తాజా కథనాలు